Saturday, March 14, 2026
Homeసినిమాప్రభాస్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్

ప్రభాస్ మూవీ గురించి క్లారిటీ ఇచ్చిన లోకేష్ కనకరాజ్

ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ డిసెంబర్ 22న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత ‘కల్కి’ సినిమా రానుంది. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ఇది. ఇందులో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తుండడం.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండడం విశేషం. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి రావాల్సిన కల్కి మూవీ సమ్మర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా తర్వాత మారుతితో చేస్తున్న మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చే్స్తున్నారు.

అయితే.. ప్రభాస్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ‘స్పిరిట్’ మూవీ చేయాలి. అలాగే హను రాఘవపూడితో ఓ సినిమా చేయాలి. లోకేష్ కనకరాజ్ తో కూడా మూవీ చేయాల్సివుంది. అయితే.. ఈ సినిమాల్లో ఏ సినిమా ముందు.. ఏ సినిమా తర్వాత అనేది క్లారిటీ లేదు. కాకపోతే స్పిరిట్, హను రాఘవపూడితో చేయనున్న సినిమాలను మాత్రం ఒకేసారి చేయాలి అనుకుంటున్నారట. మరి.. లోకేష్ కనకరాజ్ తో మూవీ ఎప్పుడు అంటే ఇంకా తెలియాల్సివుంది. లోకేష్ నెక్ట్స్ మూవీని రజినీకాంత్ తో చేయనున్నాడు.

ఆతర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడని తెలిసింది. ఇదే విషయం గురించి లోకేష్ ని అడిగితే.. ప్రభాస్ తో తప్పకుండా మూవీ ఉంటుంది. అయితే… అది లోకేష్ సినిమాటిక్ యూనివర్శ్ లో కాకుండా ప్రభాస్ కోసం వేరే స్టోరీ రెడీ చేస్తున్నానని చెప్పాడు. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పడం విశేషం. ప్రభాస్, లోకేష్ కాంబో మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ క్రేజీ కాంబో మూవీ గురించి మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular