చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ మూవీ థియేటర్లో రిలీజైంది. మరి.. చిరు నెక్ట్స్ ఏంటి అంటే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తో సినిమా అని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని మెగా డాటర్ సుస్మిత నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. చిరు పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ చిత్రాన్ని ప్రకటించనున్నారు. ఇది బ్రో డాడీ చిత్రానికి రీమేక్ అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే.. అలాంటిది ఏమీ లేదు.. రైటర్ బెజవాడ ప్రసన్న కథ అందించాడని.. ఇది స్ట్రైయిట్ మూవీ అని కూడా టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉంటే.. కళ్యాణ్ కృష్ణతో సినిమా ఫిక్స్ అయ్యింది. ఆతర్వాత బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ట్ తో చిరు సినిమా ఉంటుందని కూడా ప్రచారం జరిగింది. ఇటీవల దీనికి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఇంకా కన్ ఫర్మ్ కాలేదేమో అనుకున్నారు. అయితే… తాజా సమాచారం ప్రకారం చిరు, మల్లిడి వశిష్ట్ మూవీ కూడా ఫిక్స్ అయ్యిందట. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఇది సోషియో ఫాంటసీ మూవీ అని.. ఇందులో గ్రాఫిక్స్ కి ఎక్కువ స్కోప్ ఉందని తెలిసింది.
ఈ చిత్రాన్ని నవంబర్ లేదా డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే… ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలి అనేది మేకర్స్ ప్లాన్ అని తెలిసింది. జగదేకవీరుడు అతిలోకసుందరి, యముడుకి మొగుడు చిత్రాల తరహాలో ఈ సినిమా ఉంటుందట. బింబిసార బ్లాక్ బస్టర్ తర్వాత మల్లిడి వశిస్ట్ బింబిసార 2 చేయాలి కానీ.. కథ విషయంలో క్రియేటీవ్ డిపరెన్స్ రావడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు కాన్ సన్ ట్రేషన్ అంతా చిరు సినిమాపైనే పెట్టాడట. మరి.. ఈ సినిమాతో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.