Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్ డూప్ తోనే మారుతి సినిమా తీసేస్తున్నాడా..?

ప్రభాస్ డూప్ తోనే మారుతి సినిమా తీసేస్తున్నాడా..?

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో మూవీ అని వార్తలు వచ్చినప్పుడు ఇదేదో గ్యాసిప్ అనుకున్నారు. ఆతర్వాత ఇది నిజమని తెలిసినప్పుడు డార్లింగ్ ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. ప్రభాస్ రేంజ్ ఏంటి..? మారుతితో సినిమా చేయడం ఏంటి..? అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో విమర్శించారు. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమాను చేయద్దు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఎవరు ఏం చెప్పినా వినలేదు.. మారుతి పై నమ్మకంతో సినిమా చేయడానికి ప్రభాస్ ఓకే చెప్పారు.

ప్రభాస్, మారుతి కాంబో మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అయితే.. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది కానీ.. ఇప్పటి వరకు ఈ సినిమా గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. అసలు ఈ సినిమా కథ ఏంటి..? ఎంత వరకు షూటింగ్ అయ్యింది..? ఎప్పుడు కంప్లీట్ అవుతుందో కూడా క్లారిటీ లేదు. అయితే.. ఈ సినిమా గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. అది ఏంటంటే.. ప్రభాస్ డూప్ తోనే మారుతి చాలా వరకు షూటింగ్ చేసేస్తున్నాడట.

ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి ఇది నిజమా..? లేక గ్యాసిప్పా..? అనేది ఆసక్తిగా మారింది. అయితే.. మారుతిని ఇదే విషయం గురించి అడిగితే.. ప్రభాస్ బ్యాక్ సైడ్ నుంచి తీసే కొన్ని షాట్స్ ను డూప్ తో తీశాం కానీ.. అన్ని సీన్స్ ఎలా చేస్తామన్నాడు. ప్రభాస్ డూప్ తోనే తీస్తే సినిమా చూసే జనాలకు తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. ఇంతకీ సినిమా ఎలా ఉండబోతుంది అని అడిగితే.. ప్రభాస్ క్యారక్టర్ లో ఫన్ ఉంటుందని.. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఉంటుందని చెప్పారు. అలాగే ప్రభాస్ రేంజ్ కు తగ్గట్టుగా చాలా గ్రాండియర్ గా ఉంటుందని చెప్పాడు మారుతి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్