Sunday, September 22, 2024
Homeసినిమా'రుద్ర‌మాంబ‌పురం' ఫ‌స్ట్‌ లుక్‌, మోష‌న్‌ పోస్ట‌ర్‌ విడుదల

‘రుద్ర‌మాంబ‌పురం’ ఫ‌స్ట్‌ లుక్‌, మోష‌న్‌ పోస్ట‌ర్‌ విడుదల

శుభోద‌యం సుబ్బారావు, అజ‌య్ ఘోష్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘రుద్ర‌మాంబ‌పురం’. మూల‌వాసుల క‌థ అనేది ట్యాగ్‌లైన్‌. ఎన్‌వీఎల్ ఆర్ట్స్ ప‌తాకం పై నందూరి రాము నిర్మిస్తున్నారు. మ‌హేష్ బంటు ద‌ర్శ‌కుడు. కథే ఏ సినిమాకైనా బలం. అందుచేతనే కథనే నమ్ముకుని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే.. చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న శుభోద‌యం సుబ్బారావు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆదివారం ఈ మూవీ ఫ‌స్ట్‌ లుక్‌, మోష‌న్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు మారుతి విడుద‌ల‌ చేశారు.

టైటిల్ చాలా బాగుందని ప్ర‌శంసించి చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు దర్శకుడు మారుతి. ఈ చిత్రంలో పెద్ద‌కాపు మ‌ల్లోజుల శివ‌య్య పాత్ర‌లో శుభోద‌యం సుబ్బారావు న‌టిస్తున్నారు. వెంగీ సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి ఎన్ సుధాక‌ర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌, బొంతల నాగేశ్వ‌ర్ రెడ్డి ఎడిట‌ర్‌. వెంక‌టేశ్వ‌ర‌రావు ఆర్ట్ డైరెక్ట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రానికి క‌థ‌: అజ‌య్ ఘోష్, కో- ప్రొడ్యూస‌ర్‌: డి న‌రసింహ‌మూర్తి రాజు, సీఈఓ: అన్నింగి రాజ‌శేఖ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: కారెడ్ల బాలాజీ శ్రీ‌ను, పీఆర్ఓ: తేజ‌స్వి స‌జ్జ‌.

RELATED ARTICLES

Most Popular

న్యూస్