Saturday, January 18, 2025
Homeసినిమా‘ఏక్ మినీ కథ’ హీరోతో నందినీ రెడ్డి సినిమా

‘ఏక్ మినీ కథ’ హీరోతో నందినీ రెడ్డి సినిమా

అలా మొదైలంది, ఓ బేబీ చిత్రాలతో మెప్పించిన దర్శకురాలు నందినీ రెడ్డి. ఓ బేబీ సినిమా తర్వాత నందినీ రెడ్డి నాగచైతన్యతో సినిమా చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. రొమాంటిక్ ఎంటర్ టైనర్ అయిన ఈ స్టోరీ చైతన్యకి నచ్చిందని.. ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా టాక్ వినిపించింది. అయితే.. ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్ డేట్ బయటకు రాలేదు. తాజా వార్త ఏంటంటే.. నందినీ రెడ్డి ఏక్ మినీ కథ సినిమాలో నటించిన సంతోష్ శోభన్ తో సినిమా చేయనున్నారని సమాచారం.

ఏక్ మినీ కథలో సంతోష్ నటన తనకు బాగా నచ్చిందని.. అతనికి కథ చెప్పడం కూడా జరిగిందని తెలిసింది. కథ విని సంతోష్ ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడట. కొవిడ్ -19 పరిస్థితి మెరుగైన వెంటనే చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందట. త్వరలోనే చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియనున్నాయి. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని స్వప్నా సినిమాస్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుంది. ఈ సినిమాతో పాటు ఈ సంవత్సరం చివరలో గీతా ఆర్ట్స్ కోసం ఓ సినిమాకి దర్శకత్వం వహించడానికి ఆమె ఇప్పటికే అంగీకరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్