Wednesday, September 25, 2024
HomeసినిమాHanu-Man: ‘హను-మాన్‌’ అందరి అంచనాలని అందుకుంటుంది - ప్రశాంత్ వర్మ

Hanu-Man: ‘హను-మాన్‌’ అందరి అంచనాలని అందుకుంటుంది – ప్రశాంత్ వర్మ

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి చిత్రం ‘హను-మాన్‌’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌ టైన్‌మెంట్‌ పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ భారీ అంచనాలు పెంచింది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే..

వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్ చివరికి పూర్తవుతాయని ప్రామిస్ చేశారు. చివర్లో చూసి క్వాలిటీ పరంగా రెడీ అనుకున్నప్పుడు జూలై ఫస్ట్ వీక్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేద్దామని భావిస్తున్నాం. వీఎఫ్ఎక్స్ వర్క్ మన చేతిలో ఉండదు. ఒకొక్క షాట్ రెండర్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. అమెరికా, చైనా రెండర్స్ వాడుతునప్పటికీ చాలా సమయం తీసుకుంటుంది. టీజర్ విడుదల చేసిన తర్వాత అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలని అందుకోవడానికి ఇంకొంత యాడ్ చేశాం. టైం ఇస్తే వీఎఫ్ఎక్స్ వర్క్ చాలా బాగా వస్తాయి. మంచి ఫన్ ఎంటర్టైనింగ్ సూపర్ హీరో సినిమా చేయాలని మొదలుపెట్టాం. నెమ్మదిగా మాకు వస్తున్న రెస్పాన్స్ ని బట్టి, సినిమాకి క్రియేట్ అయిన మార్కెట్ ని బట్టి స్కేల్ పెంచుకుంటూ వెళ్ళాం.

కథ పరంగా ఒక క్యారెక్టర్ ని యాడ్ చేశాం. సినిమా అంతా చూసుకున్న తర్వాత 95 శాతం రీచ్ అయినట్టు అనిపించింది. ఐదు శాతం ఏదో మిస్ అవుతుందని చర్చించిన తర్వాత ఒక పాత్ర యాడ్ చేస్తే.. 100 శాతం అవుతుందనిపించింది. ఆ పాత్ర షూట్ చేసి యాడ్ చేసి చూసుకున్నాక 200 శాతం అయ్యింది. మొదట తెలుగులోనే తీయాలి అనుకున్నాం. టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత హిందీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత తమిళ్ ,కన్నడ ,మలయాళం నుంచి రెస్పాన్స్ వచ్చింది. మేము క్రియేట్ చేసిన ప్రోడక్ట్ కి డిమాండ్ వచ్చింది. వాళ్ళు అడగకపోయివుంటే తెలుగు వరకే ఫిక్స్ అయ్యేవాళ్ళం.

ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. వాటిని ప్రజంట్ చేయడం కూడా ఒక సవాల్ తో కూడుకున్నదే. అయితే మేము అంత సవాల్ తీసుకోలేదు. మేము చెప్పే కథ ప్రస్తుతంలో జరుగుతుంది. హనుమంతుడు కథలో జరిగిన ఒక కీలక సంఘటనని తీసుకొని చేశాం. హనుమంతుని కథలో ఓ సంఘటన జరిగింది కాబట్టి అక్కడి నుంచి ఇలా జరిగుంటే ఎలా ఉంటుందనే అంశం పై బిల్డ్ చేసిన కథ. చాలా వరకూ కథ కరెంట్ టైమ్స్ లో వుంటుంది. హనుమంతుడిని ఎలా చూడాలని చిన్నప్పటినుంచి అనుకుంటున్నారో అది అయితే ఇందులో చూపించగలుగుతున్నాను. హనుమంతుడు ఎలా కనిపించాలనే క్యారెక్టర్ స్కెచ్ పైనే దాదాపు ఏడాది పాటు పని చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే.. హనుమాన్ అందరి అంచనాలని అందుకుంటుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్