Saturday, January 18, 2025
Homeసినిమా బాలయ్యతో వర్మ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

 బాలయ్యతో వర్మ మూవీ ఫిక్స్ అయ్యిందా..?

బాలకృష్ణ ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించారు. ఇప్పుడు ‘వీరసింహారెడ్డి‘ అనే పవర్ ఫుల్ టైటిల్ తో మూవీ చేస్తున్నారు. సరసన శృతిహాసన్ నటిస్తుంది. మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలోనే బాలయ్య తదుపరి మూవీ పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో బాలయ్య ఓ భారీ చిత్రం చేయనున్నారు. ఈ చిత్రాన్ని ఆల్రెడీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య మూవీ ఎవరితో ఉంటుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. కారణం ఏంటంటే.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్యతో ఓ సినిమా చేయనున్నాడు అని టాక్ వినిపిస్తోంది. ఈమధ్య కాలంలో ఈ కాంబో గురించి అసలు వార్తలు రాలేదు.

మరి.. ఎలా ఇంత సడన్ గా ఈ కాంబినేషన్ సెట్ అయ్యిందంటే.. బాలకృష్ణ హోస్టు చేస్తున్నఅన్ స్టాబుల్-2 షో టీజర్ కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన అన్ స్టాపబుల్-2 టీజర్ కు మంచి  ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే దర్శకుడు ప్రశాంత్ వర్మ బాలకృష్ణకు ఓ కథను విన్పించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీని ఆర్ఆర్ఆర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించనున్నారని సమాచారం. మరి.. ఇదే కనుక నిజమైతే.. ప్రశాంత్ వర్మకు బంపర్ ఆఫరే

RELATED ARTICLES

Most Popular

న్యూస్