Wednesday, March 11, 2026
Homeసినిమావెంకటేష్ 'సైంధవ్' క్లైమాక్స్ షెడ్యూల్‌ పూర్తి..

వెంకటేష్ ‘సైంధవ్’ క్లైమాక్స్ షెడ్యూల్‌ పూర్తి..

వెంకటేష్, శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ‘సైంధవ్’ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు వెంకట్ బోయనపల్లి. సైంధవ్ వెంకటేష్ 75వ మైల్ స్టోన్ మూవీ. మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని రాజీపడకుండా నిర్మిస్తున్నారు. మేకర్స్ 16 రోజులలో కీలకమైన షెడ్యూల్‌ను పూర్తి చేశారు, ఎనిమిది మంది ముఖ్య నటీనటులు షూట్‌లో పాల్గొన్న హై-ఆక్టేన్ ఎమోషనల్ క్లైమాక్స్‌ను హర్ష్ కండీషన్స్ లో చిత్రీకరించారు.

యాక్షన్ ఎపిసోడ్‌ను రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ సూపర్ వైజ్ చేశారు. వెంకటేష్‌కి ఇప్పటి వరకు ఇదే మోస్ట్ ఎక్స్ పెన్సివ్  క్లైమాక్స్ పోర్షన్. సినిమా రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల చిత్ర బృందం ఆనందంగా ఉంది.

నవాజుద్దీన్ సిద్ధిక్, శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా, సారాతో సహా దాదాపు అన్ని ప్రధాన పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular