Sunday, January 19, 2025
Homeసినిమాదిల్ రాజుకు షాక్ ఇచ్చిన శంకర్..?

దిల్ రాజుకు షాక్ ఇచ్చిన శంకర్..?

రామ్ చరణ్‌, శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇది రామ్ చరణ్ 15వ చిత్రం కాగా, దిల్ రాజుకు 50వ చిత్రం కావడం విశేషం. ఈ చిత్రాన్ని స్టార్ట్ చేసినప్పుడు చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేశారు. అయితే.. ఎప్పుడైతే శంకర్ ‘ఇండియన్ 2’ షూటింగ్ చేయాల్సి వచ్చిందో అప్పటి నుంచి గేమ్ ఛేంజర్ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడింది. గేమ్ ఛేంజర్ మూవీ నుంచి ఎలాంటి అప్ డేట్స్ లేకపోవడంతో ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ ఇస్తారా అని చరణ్‌ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇండియన్ 2 షూటింగ్ చేయాల్సి వచ్చినప్పటి నుంచి గేమ్ ఛేంజర్ ప్లానింగ్ అంతా మారిపోయింది. ఈ రెండు సినిమాలను ఒకేసారి షూటింగ్ చేసేలా ప్లాన్ చేశారు కానీ.. వర్కవుట్ కాలేదు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. అసలు ఇండియన్ 2 ఎప్పుడు రిలీజ్ కానుందో ఇంకా క్లారిటీ లేదు. ఇండియన్ 2 రిలీజ్ క్లారిటీ వచ్చిన తర్వాత గేమ్ ఛేంజర్ మూవీ విడుదల పై క్లారిటీ వస్తుంది. అయితే… గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ ఇవ్వడం లేదు అంటూ అభిమానులు నిర్మాత దిల్ రాజును టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు.

రెండు వందల కోట్ల బడ్జెట్ తో తీస్తున్న సినిమా సంవత్సరాలకు సంవత్సరాలు ఆలస్యం అయితే.. నిర్మాతకు భారీగా నష్టం. అయితే.. చేసేది ఏమీ లేక ఎదురు చూస్తున్నాడు. ఇన్నాళ్ల కెరీర్ లో ఎప్పుడూ దిల్ రాజుకు ఇలా జరగలేదు కానీ.. అభిమానులు మాత్రం దిల్ రాజును వదలడం లేదు. తాజాగా దిల్ రాజును గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ కోసం మీడియా ప్రతినిధులు అడిగితే.. మన చేతుల్లో ఏమీ లేదు. డైరెక్టర్ గారి చేతుల్లోనే అంతా ఉంది. ఆయన ఇచ్చినప్పుడు మాత్రమే అప్ డేట్స్ బయటకు వస్తాయి అని దిల్ రాజు చేతులెత్తేశారు. ఆయన అలా మాట్లాడారంటే… శంకర్ ఎంతలా షాక్ ఇచ్చివుంటారో అర్థం చేసుకోవచ్చు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిని బట్టి దిల్ రాజు పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి.. శంకర్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్