Wednesday, March 18, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్ గురించి శంక‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

ఆర్ఆర్ఆర్ గురించి శంక‌ర్ సెన్సేష‌న‌ల్ కామెంట్స్

Shakar on RRR: ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్ధాయిలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దేశం మొత్తం మ‌రోసారి తెలుగు సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది ఆర్ఆర్ఆర్. కొమ‌రం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ న‌ట విశ్వ‌రూపం చూపించారు అంటూ అభినందిస్తున్నారు. టాలీవుడ్ అనే కాకుండా.. కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ ప్ర‌ముఖులు సైతం ఆర్ఆర్ఆర్ టీమ్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ఆర్ఆర్ఆర్ మూవీ గురించి స్పందిస్తూ.. ఆర్ఆర్ఆర్ కి కొత్త అర్ధాన్ని వివ‌రిస్తూ.. “అదిరిపోయే అనుభూతిని ఇచ్చినందుకు చిత్ర‌యూనిట్ అంద‌రికీ చాలా థ్యాంక్స్. రామ్ చరణ్ రేజింగ్ పెర్ ఫార్మాన్స్- తన స్క్రీన్ ప్రెజెన్స్ అలాగే కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఎమోషనల్ పెర్ ఫార్మెన్స్ లుగా నిలిచిపోతాయి. మీ ఊహా శక్తి అతీతమైనది హ్యాట్సాఫ్ మహారాజ మౌళి” అంటూ కామెంట్స్ చేయ‌డం ఆస‌క్తిగా మారింది.

Also Read : బెనిఫిట్ షోల్లోనూ ఆర్ఆర్ఆర్ రికార్డులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular