Sunday, January 19, 2025
Homeసినిమావిజయ్, శంకర్ కాంబోలో పొలిటికల్ మూవీ..?

విజయ్, శంకర్ కాంబోలో పొలిటికల్ మూవీ..?

విజయ్ ప్రస్తుతం ‘లియో’ అనే సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న లియో షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత వెంకట్ ప్రభు డైరెక్షన్ లో విజయ్ మూవీ అని వార్తలు వచ్చాయి. అయితే.. విజయ్ లియో మూవీ రిలీజ్ కాకుండానే పాదయాత్ర చేయాలి అనుకుంటన్నారట. ఈ పాదయాత్ర ఎందుకు అంటే.. విజయ్ పొలిటికల్ గా ఎంట్రీ ఇవ్వనున్నారని.. అందుకే ఈ పాదయాత్ర అంటూ తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇటీవల విజయ్ అభిమాన సంఘాల నాయకులతో సమావేశం అయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. విజయ్ రాజకీయాల్లోకి రావడం ఖాయం అనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. రాజకీయాల్లోకి వెళ్లే ముందు విజయ్.. పొలిటికల్ మూవీ చేయాలి అనుకుంటున్నారట. అది కూడా శంకర్ డైరెక్షన్ లో పొలిటికల్ మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం శంకర్ ఇండియన్-2 సినిమా చేస్తున్నాడు. మరో వైపు ఈ సినిమాతో పాటు చరణ్ హీరోగా గేమ్ ఛేంజర్ మూవీ కూడా చేస్తున్నాడు.

వీటిలో ఇండియన్-2 షూట్ దాదాపు పూర్తయింది. అటు గేమ్ ఛేంజర్ 70 శాతం కంప్లీట్ అయింది. ఈ రెండు సినిమాల తర్వాత శంకర్.. విజయ్ తో సినిమా చేయనున్నాడని తెలిసింది. ఈ సినిమాకి సంబంధించి కథాచర్చలు కూడా జరిగాయని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై విజయ్ కానీ.. శంకర్ కానీ.. స్పందించలేదు. త్వరలోనే ఈ సినిమా పై క్లారిటీ రానుంది. ప్రచారంలో ఉన్నట్టుగా విజయ్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చినా.. శంకర్ తో రాజకీయ చిత్రం చేసినా సంచలనమే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్