Tuesday, March 17, 2026
Homeసినిమాశివ నిర్వాణ పాడిన‌ 'ట‌క్' సాంగ్ రిలీజ్

శివ నిర్వాణ పాడిన‌ ‘ట‌క్’ సాంగ్ రిలీజ్

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ఒకటి. ‘నిన్నుకోరి వంటి హిట్ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో వస్తోన్న చిత్రం ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన పాటలు శ్రోత‌ల‌ను అల‌రిస్తుండగా టీజ‌ర్‌, ట్రైల‌ర్ అందరి ప్రశంసలను దక్కించుకుంది. ఈ రోజు గోపి సుందర్ స్వరపరిచిన ‘టక్’ పాటను విడుద‌ల‌ చేసింది చిత్ర యూనిట్‌. ఈసారి ఒక ఇంటెన్స్ నెంబ‌ర్ సాంగ్‌తో మ‌న‌ముందుకు వ‌చ్చారు.

ఈ పాటను ద‌ర్శ‌కుడు శివ నిర్వాణ స్వయంగా పాడ‌డం విశేషం. ఈ పాట శైలికి తగ్గ‌ట్టుగా ఆయ‌న వాయిస్ చాలా ఎన‌ర్జిటిక్‌గా ఉంది. నాని మాస్‌, యాక్షన్ అవతారంలో క‌నిపించ‌నున్నారు. అన్ని ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ‘ట‌క్ జ‌గ‌దీష్’ వినాయ‌క చ‌వితి కానుక‌గా సెప్టెంబ‌ర్‌10 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. రీతు వ‌ర్మ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ఐశ్వ‌ర్య రాజేష్ కీల‌క‌పాత్ర‌లో న‌టించింది. నాని సోద‌రుడిగా విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌నున్నారు. నాని 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ మూవీని షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular