Sunday, January 19, 2025
Homeసినిమాదసరా డైరెక్టర్ తో ప్రభాస్‌ మూవీ

దసరా డైరెక్టర్ తో ప్రభాస్‌ మూవీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం కె.జి.యఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్‌’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదలకు సిద్ధమవుతున్నది. నాగ్ అశ్విన్ మూవీ ‘కల్కీ’తో పాటు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్స్‌ సమాంతరంగా సాగుతున్నాయి. సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ‘స్పిరిట్‌’ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌మీదకు వెళ్లనుంది.

ఈ బిజీ లైనప్‌లో కూడా ప్రభాస్‌ ఓ కొత్త సినిమా ఓకే చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.దసరా ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం. ఓ యధార్థ సంఘటన నేపథ్యంలో మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది.కథలోని హై ఇంటెన్సిటీ యాక్షన్‌, ఎమోషన్స్‌ నచ్చడంతో ప్రభాస్‌ ఈ సినిమాకు అంగీకరించారని అంటున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్