Thursday, March 12, 2026
Homeసినిమాశివరాత్రి సందర్భంగా 'మహా లింగాపురం' ఫస్ట్ లుక్

శివరాత్రి సందర్భంగా ‘మహా లింగాపురం’ ఫస్ట్ లుక్

Om Namassivaaya: దత్త సాయి క్రియేషన్స్ బ్యానర్ పై మాస్టర్ పునీత్ కాడిగారి, మాస్టర్ మనో రూపేష్ సమర్పణలో ప్రవీణ్ రెడ్డి కాడిగారి నిర్మాతగా శ్యామ్ మండల దర్శకత్వంలో వస్తోన్న సినిమా ‘మహా లింగాపురం’. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంలో హరీష్ వినయ్, ప్రియాంక  హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్, రామరాజు, దువ్వాసి మోహన్, ప్రభావతి, అంబటి శ్రీనివాస్, మహేంద్రనాధ్ తాటికొండ, సివిఎల్ తదితరులు ముఖ్య పాతాల్లో నటిస్తున్నారు.

దర్శకుడు శ్యామ్ మండల గతంలో ట్రూ, అం అః చిత్రాలకు దర్శకత్వం వహించారు, తన దర్శకత్వంలో వస్తోన్న మూడో చిత్రం మహా లింగాపురం.  మహా శివరాత్రి సందర్భంగా ఈ  చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ” సినిమా ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో వర్క్ చేసిన అందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. నా దగ్గర వర్క్ చేసిన దర్శకుడు శ్యామ్ మండలకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను” అన్నారు.

దర్శకుడు శ్యామ్ మండల మాట్లాడుతూ “మహా శివలింగాపురం చిత్ర ఫస్ట్ లుక్ ను సురేందర్ రెడ్డి గారు విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. సస్పెన్స్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించబోతున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాను” అన్నారు.

Also Read : అమెరికాలో ‘భీమ్లా నాయ‌క్‌’ సందడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular