Monday, February 24, 2025
Homeసినిమాదర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత

దర్శకుడు సూర్యకిరణ్ కన్నుమూత

నటుడు, దర్శకుడు సూర్య కిరణ్ అనారోగ్యంతో నేడు చెన్నైలో మరణించారు. హీరోయిన్ కల్యాణి మాజీ భర్త అయిన సూర్యకిరణ్ గత కొన్ని రోజుల నుంచి పచ్చ కామెర్ల వ్యాధితో భాదపడుతున్నారు. ఆ వ్యాధి ముదరడంతో కన్నుమూసినట్లు తెలుస్తోంది.

సుమంత్ హీరోగా నటించిన సత్యం సినిమాతో దర్శకుడిగా సూర్యకిరణ్ మంచి గుర్తింపు సాధించారు. ఆ తరువాత ధన 51, బ్రహ్మాస్త్రం, రాజుభాయ్ వంటి సినిమాలను ఆయన  రూపొందించారు. దర్శకుడిగా తన కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్న సమయంలోనే నాటి హీరోయిన్ కల్యాణిని వివాహమాడారు. మనస్పర్ధల కారణంగా కొద్ది కాలంలోనే వీరు విడాకులు తీసుకున్నారు.

నాగార్జున హోస్ట్ గా ఉన్న బిగ్ బాస్ తెలుగు 4 వ సీజన్ లో సూర్యకిరణ్ పాల్గొన్నారు. ప్రముఖ టివి నటి సుజిత స్వయానా సూర్యకిరణ్ సోదరి కావడం గమనార్హం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్