Sunday, January 19, 2025
Homeసినిమాది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?

ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌తో రామ్ చరణ్ సినిమా?

రామ్ చరణ్‌ ప్రస్తుతం శంకర్ తో సినిమా చేస్తున్నారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కు జంటగా కైరా అద్వానీ నటిస్తుంది. ఇప్పటి వరకు అరవై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల హైదరాబాద్ లో షూటింగ్ చేశారు. ఈ వారంలో విశాఖపట్నంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ ప్రధాన తారాగణం అంతా పాల్గొంటారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీని సమ్మర్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఇటీవల ట్విట్టర్‌లో ఒక అభిమానికి ఇచ్చిన రిప్లై అనేక ప్రశ్నలను లేవనెత్తింది. ఇంతకీ ఏంటా రిప్లై అంటే.. రామ్ చరణ్‌తో వివేక్ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానని ఓ అభిమాని రాస్తూ వివాదాస్పద దర్శకుడిని ట్యాగ్ చేశాడు. దీనికి దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అని వివేక్ అగ్నిహోత్రి రిప్లై ఇచ్చాడు. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. చరణ్‌, వివేక్ రంజన్ అగ్నిహోత్రి కాంబినేషన్ లో మూవీని ఎవరూ ఊహించలేదు. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి టాక్ బయటకు రాలేదు

అలాంటిది వివేక్ రంజన్ మమ్నల్ని ఆశ్వీరదించండి అని రిప్లై ఇవ్వడంతో రామ్ చరణ్ తో మూవీకి వివేక్ దర్శకత్వం వహిస్తాడా..? లేక చరణ్‌ తో వివేక్ మూవీని నిర్మిస్తాడా..? అనేది ఆసక్తిగా మారింది. రామ్ చరణ్‌.. ఇటీవల బుచ్చి బాబు సానాతో ఒక చిత్రాన్ని ప్రకటించాడు. మైత్రీ మూవీస్ సమర్పణలో రూపొందే ఈ సినిమాను త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే, చరణ్‌కి సుకుమార్‌తో ఒక ప్రాజెక్ట్ ఉంది. మరి ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్‌ వివేక్ చరణ్‌, సుక్కు ప్రాజెక్ట్ తో అసోసియేట్ అవుతాడా..? లేక చరణ్‌ తో వివేక్ ఓ మూవీని రూపొందిస్తాడా అనేది క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్