Saturday, March 29, 2025
Homeసినిమాఏపీ ప్రభుత్వానికి తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కృత‌జ్ఞత‌లు

ఏపీ ప్రభుత్వానికి తెలుగు డిస్ట్రిబ్యూట‌ర్స్ కృత‌జ్ఞత‌లు

Distributors Council  : ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట క‌లిగింది. సీల్ చేసిన థియేటర్లు తిరిగి ఒపెన్ చేసేందుకు అనుమ‌తినిచ్చిన ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ కృత‌జ్ఞత‌లు తెలిపింది. ఇటీవ‌ల ఏపీ ప్రభుత్వానికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ త‌ర‌పున కొన్ని విన్నపాలు చేశారు.

“మొద‌టగా థియేట‌ర్స్ రీ ఒపెనింగ్ కి అనుమతి నిచ్చిన ఆంధ్రప్రదేశ్ సిఎం వై.ఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డిగారికి, సినిమాటోగ్రఫి మంత్రి వర్యులు పేర్ని నాని గారికి తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ తరపున కృత‌జ్ఞ‌త‌లు. మిగ‌తా విన్నపాల ప‌ట్ల కూడా సానుకూలంగా స్పందించి మ‌మ్మల్ని ఆదుకుంటార‌ని ఆశిస్తున్నాము” అని తెలుగు ఫిలిం డిస్ట్రిబ్యూట‌ర్స్ కౌన్సిల్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Also Read : టికెట్ రేట్లపై కమిటీ నిర్ణయం: మంత్రి పేర్ని

RELATED ARTICLES

Most Popular

న్యూస్