Sunday, January 19, 2025
HomeTrending Newsచీఫ్ జస్టిస్ ముందుకు పీఆర్సీ పిటిషన్

చీఫ్ జస్టిస్ ముందుకు పీఆర్సీ పిటిషన్

to CJ Bench: పీఆర్సీ అమలుపై విధి విధానాలను ఖరారుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలపై విచారణను చీఫ్ జస్టిస్ ధర్మాసనానికి బదిలీ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ గెజిటెడ్ అధికారుల జేఏసీ చైర్మన్ కేవీ క్రిష్ణయ్యతోపాటు మరికొన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఈ జీవోలపై హైకోర్టును ఆశ్రయించాయి. దీనిపై నేడు ధర్మాసనం విచారణ చేపట్టింది. హైకోర్టు పిటిషనర్ల వాదనలపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ జీతాలు తగ్గించే హక్కు ప్రభుత్వానికి ఉందని అభిప్రాయపడింది. మరికొందరి వాదనలు కూడా వినేందుకు మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేసింది. పిటిషనర్లను, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల స్టీరింగ్ కమిటీ సభ్యులు 12 మందిని, ప్రభుత్వం తరఫున జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ లు  తమ వాదనలు కూడా వినిపించాలని కోరింది.

అనంతరం మళ్ళీ విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ పిటిషన్ లో విస్తృత ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని, ప్రజా ప్రయోజనాలు కూడా ముడిపడి ఉన్నందున ఈ పిటిషన్ ను చీఫ్ జస్టిస్ కు నివేదిస్తున్నట్లు తెలిపింది.

నేటి ఉదయం విచారణలో పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు. ఆర్ధిక అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉద్యోగుల జీతాలు తగ్గించాలని, కానీ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోలతో ఉద్యోగుల ప్రస్తుత జీవోల్లో కోత పడుతుందని ఉద్యోగ సంఘాల నేతలు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ జీవోలు ఆంధ్ర ప్రదేశ్ పురర్విభజన చట్టానికి కూడా వ్యతిరేకంగా ఉన్నాయని వారు పిటిషన్ లో పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఎపీకి వచ్చే ఉద్యోగులకు కొన్ని రాయితీలు, ప్రయోజనాలు కల్పిస్తున్నారని, గత ప్రభుత్వం కల్పించిన హెచ్ ఆర్ ఏ ను కూడా తగ్గించారని వారు కోర్టు దృష్టి కి తీసుకు వచ్చారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్