Monday, January 20, 2025
Homeసినిమాదివ్యాన్ష గ్లామర్ కి కలిసి రాని సినిమా!   

దివ్యాన్ష గ్లామర్ కి కలిసి రాని సినిమా!   

టాలీవుడ్ లో అడుగుపెడుతూనే హిట్ కొట్టే హీరోయిన్స్ కొంతమంది అయితే, మొదటి సినిమాతోనే భారీ ఫ్లాప్ అందుకునేవారు మరికొంతమంది. ఇక మొదటి సినిమాతోనే భారీ సక్సెస్ ను అందుకుని, ఆ తరువాత ఆ స్థాయి సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ వెళ్లేవారు ఇంకొంతమంది. ఇదిగో ఈ కేటగిరికి చెందినవారి జాబితాలోనే దివ్యాన్ష కౌషిక్ ఒకరుగా కనిపిస్తుంది. దివ్యాన్ష పేరు కొంతమందికి గుర్తుండకపోవచ్చు. కానీ ‘మజిలీ’ బ్యూటీ అనగానే కళ్లముందుకు ఆమె రూపం కదలాడుతుంది.

‘మజిలీ’ సినిమాతోనే ఆమె తెలుగు తెరకి పరిచయమైంది. ఒక్క తెలుగులో అనే కాదు .. కెరియర్ పరంగా ఆమెకి ఇది మొదటి సినిమా. ప్రేమ .. పెళ్లి .. మధ్యలో జరిగే మానసిక సంఘర్షణ ప్రధానంగా నడిచే ఈ కథలో దివ్యాన్ష అందంగా మెరిసింది. అందం .. ఆకర్షణీయమైన రూపం .. మంచి స్కిన్ టోన్ ఉన్న ఈ అమ్మాయిని చూసి, కుర్రాళ్లంతా ఫిదా అయ్యారు. ఈ సుందరి జోరు సాగే అవకాశాలు బాగానే ఉన్నాయని అనుకున్నారు. అయితే రెండో సినిమా చేతికి రావడానికే ఆమెకి  చాలా సమయం పట్టింది.

‘మజిలీ’ తరువాత దివ్యాన్ష చేసిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ .. ‘మైఖేల్’ సినిమాలు ఆమె కెరియర్ కి ఎంతమాత్రం హెల్ప్ కాలేకపోయాయి.  ఇలాంటి పరిస్థితుల్లోనే ఆమె సిద్ధార్థ్ జోడీగా ‘టక్కర్’ చేసింది. ఈ సినిమా చాలా హడావిడి చేస్తూనే థియేటర్స్ కి వచ్చింది. ఫలితం మాత్రం నిరాశనే మిగిల్చింది. ఈ సినిమాకి దివ్యాన్ష గ్లామర్ ప్రధానమైన ఆకర్షణగా నిలిచింది. కానీ సినిమా ఫ్లాప్ వలన ఆమె గురించి మాట్లాడుకునేవారు లేరు. ఫ్లాప్ సినిమాలో ఉన్న మంచి పాటకి సరైన గౌరవం దక్కదు. అలాగే ఆ సినిమాలో ఉన్న హీరోయిన్ గ్లామర్ కి కూడా గుర్తింపు లభించదనే విషయం కూడా తెలిసిందే కదా!

RELATED ARTICLES

Most Popular

న్యూస్