Thursday, March 19, 2026
Homeసినిమా‘డీజే టిల్లు’ సెన్సార్ పూర్తి

‘డీజే టిల్లు’ సెన్సార్ పూర్తి

Censor completed: సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన‌ సినిమా ‘డీజే టిల్లు’. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఫిబ్రవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది.

సినిమా వ్య‌వ‌థి 124 నిమిషాలు. అంటే రెండు గంట‌ల నాలుగు నిమిషాలు. ర‌న్ టైమ్ చూస్తే సినిమా ఎంత షార్ట్ అండ్ స్పీడ్ అనేది స్ప‌ష్ట‌మ‌వుతుంది. రీసెంట్‌గా విడుద‌లైన ‘డీజే టిల్లు’ ట్రైల‌ర్ చూసిన వారు కొంత మంది ఇదేదో అడ‌ల్డ్ కాన్సెప్ట్ మూవీ ఏమో అని కూడా అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ లేద‌ని, అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కులు చూసే, అన్నీ ర‌కాల ఎమోష‌న్స్ ఉన్న మూవీ అని సెన్సార్ స‌ర్టిఫికేట్ చూడ‌గానే తెలుస్తుంది. శుక్ర‌వారం మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ మూవీ ‘ఖిలాడి’ రిలీజ్ ఉండ‌టంతో ‘డీజే టిల్లు’ని శ‌నివారం రోజున విడుద‌ల చేయ‌డానికి మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular