Sunday, January 19, 2025
Homeసినిమా‘డిజె టిల్లు’ కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ : నాగవంశీ

‘డిజె టిల్లు’ కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ : నాగవంశీ

Trailer of DJ Tillu: సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘డిజె టిల్లు’, ప్రముఖ నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఫిబ్రవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హైద‌రాబాద్‌లోని ఏఎంబీ మాల్‌లో ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ… ఈ ఏడాది మా సంస్థ నుంచి మూడు చిన్న సినిమాలు వస్తాయి. మధ్యలో  పెద్ద సినిమా ‘భీమ్లా నాయక్’ కూడా ఉంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న ఆ సినిమా విడుదల చేస్తాం. ‘డిజె టిల్లు’ యూత్ సినిమా, ‘భీమ్లా నాయక్’ మాసివ్ సినిమా. ‘డిజె టిల్లు’ ఫిబ్రవరి 11న విడుదల చేస్తాం. నాకు కథ చాలా బాగా నచ్చడంతో కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. దీని మీద మాకు చాలా నమ్మకం ఉంది. గ్యారెంటీ గా విజయం సాధిస్తుంది అన్నారు.

సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ… విమల్ కృష్ణ, నేను డిస్కస్ చేసుకుని కథ, స్క్రీన్ ప్లే రాశాం. డైలాగ్స్ నేను రాశా. థియేటర్ లో మీరు బాగా నవ్వుకుంటారు. నేను జీవితంలో చూసిన సందర్భాలు, మనుషులు, నా స్వభావాలు కొన్ని కలిపి ఈ క్యారెక్టర్ రాసుకున్నాం. డిజె టిల్లు పాత్రకు హద్దులు ఉండవు. ఏదైనా మాట్లాడుతాడు. ఏ సందర్భానైన్నా ఎదుర్కొంటాడు. త్రివిక్రమ్ గారు స్క్రిపు విషయంలో మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. నిర్మాత వంశీ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు. ఈ సినిమా రాసేటప్పుడు మాకు అండగా నిలబడిన త్రివిక్రమ్ గారికి థాంక్స్ చెప్పాలి.

కొన్నిసార్లు మా సినిమా పొటెన్షియల్ ఏంటో ఆయన మాకు గుర్తు చేసేవారు. రచయితగా నా మీద ఆయన ప్రభావం ఉంది. జంధ్యాల గారి ప్రభావం కూడా ఉంది. డైలాగులతో కథను ముందుకు తీసుకువెళ్లే సినిమాలు నాకు ఇష్టం. స్పేస్ లేనిచోట ఎలా క్రియేట్ చేయాలో ఆయన్ను చూసి తెలుసుకున్నాను. నేను నెక్స్ట్ సినిమా కూడా సితారలో చేస్తున్నాను. దాని తర్వాత ఇంకో సినిమా కూడా చేస్తున్నాను. నాకు సితార హోమ్ బ్యానర్ లాంటిది. ఇది చాలా ఎంటర్టైనింగ్ ఫిలిం. థియేటర్లకు వెళ్లిన అందరూ కళ్లల్లో నీళ్లు వచ్చేలా నవ్వుతారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఈ సినిమా అమ్మాయి గురించి. ఆమె జీవితంలోకి డిజె టిల్లు లాంటి క్యారెక్టర్ వస్తే ఏం జరిగిందనేది సినిమా. యూత్ కు రిలేట్ అయ్యేలా సినిమా తీశాం” అని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్