Title Song-DJ Version: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ స్టార్ రానా దగ్గుబాటిల కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించడం విశేషం. దీంతో భీమ్లా నాయక్ పై మరింత ఆసక్తి పెరిగిందని చెప్పచ్చు.
ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలు రెట్టింపు అయ్యాయి. సంక్రాంతికి వస్తుంది అనుకున్న భీమ్లా నాయక్ మూవీని ఫిబ్రవరి 25కి వాయిదా వేయడం జరిగింది. అయితే.. ఈ సినిమా నుంచి మేకర్స్ ఎప్పటికప్పుడు మంచి అప్ డేట్స్ ని ఇస్తూ వస్తున్నారు. ఈ రోజు క్రేజీ అనౌన్సమెంట్ ని అందించారు. అది ఏంటంటే.. భీమ్లా నాయక్ నుంచి మాస్ చార్ట్ బస్టర్ అయ్యినటువంటి ‘లా లా భీమ్లా.. డీజే వెర్షన్’ సాంగ్ ని డిసెంబర్ 31న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
కొత్త సంవత్సరం వేడుకని సెలెబ్రేట్ చేసుకోడానికి డిసెంబర్ 31 సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ధ్రువీకరించారు. ముందు సాంగ్ కే వేరే లెవెల్ బేస్ ట్యూన్ ఇచ్చిన థమన్ డీజే వెర్షన్ ని దింపుతున్నాడు. దీనిని బట్టి ఈ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ సాంగ్ తో మరోసారి యూట్యూబ్ షేక్ అవ్వడం ఖాయం.
Also Read : ఫిబ్రవరి 25కు మారిన భీమ్లా నాయక్