రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన ఓ అభిమాన సంఘం, ఆయన్ను జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంత మంది చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్లు అయితే… తన పథకాల ద్వారా మంచి జరిగిన ప్రతి ఇల్లూ.. ఆ ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ తనకు స్టార్ క్యాంపెయినర్లని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ‘కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి అజెండా, జనాల గుండెల్లో గుడి కట్టడమే జగన్ అజెండా’ అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఆసరా నాలుగో విడత నిధుల విడుదల సందర్భంగా ఉరవకొండలో జరిగిన బహిరంగసభలో జగన్ ప్రసంగించారు.
జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
* ఏమీ చేయని వారికి, చెడు మాత్రమే చేసిన చరిత్ర ఉన్న వారికి, చంద్రబాబుకు, ఆయన ఎల్లో మీడియాకు, ఆయన గజదొంగల ముఠా, ఆయనకు తోడు ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.
* రోజూ ఇలాంటి వారికి సమాధానం ఇవ్వాల్సి రావడమే నిజంగా కలికాలం అనిపిస్తుంది.
* ప్రతి ఇంట్లోనూ జరిగిన మంచి కనిపిస్తోంది. అయినా రోజూ అబద్ధాలు, ఎక్కువ మంది వాళ్లవైపు ఉన్నారు కాబట్టి, టీవీ చానళ్లు ఉన్నాయి కాబట్టి రోజూ అబద్దాలతో వడ్డించడం, దానికి కూడా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు.
* ఏ మంచీ చేయకపోయినా, ఏ స్కీములూ ఆయన అమలు చేయకపోయినా కూడా కేవలం మోసాలే ఆయన చేసినప్పటికీ చంద్రబాబుకేమో స్టార్ క్యాంపెయినర్లు దండిగా మంది ఉన్నారు.
* బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకొని మోసే ముఠా. చాలా మంది ఉన్నారు.
* మన రాష్ట్రంలో ఎవరూ ఉండరు. వాళ్లు ఇళ్లు, కాపురాలు,సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి.
* పక్క రాష్ట్రంలో పర్మినెంట్ రెసిడెంట్గా ఉన్న దత్తపుత్రుడు స్టార్ క్యాంపెయినర్ అయితే, చంద్రబాబు వదినగారు.. ఆమె పక్కపార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు మరో స్టార్ క్యాంపెయినర్. ఆయన వదిన అంటే అందరికీ తెలిసే ఉంటుంది.
* పక్క రాష్ట్రంలో శాశ్వతంగా ఉంటున్న ముగ్గురు మీడియా అధిపతులు. అక్కడున్న ఆ మీడియా అధిపతులు ఓ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5. వీళ్లంతా బాబుకు స్టార్ క్యాంపెయినర్లే.
* బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న.. అంది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా ఇంకొంత మంది బాబుకు స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు.
* అమరావతిలో బాబు భూములకు బినామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ, ఇతర పార్టీల్లోనూ రకరకాల రూపాల్లో చంద్రబాబుకు బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగా కొనసాగుతున్నారు.
* టీవీలు ఆన్ చేస్తే విశ్లేషకుల పేరిట కనిపిస్తారు, వేదికల పేరు మీద, మేధావులు అని చెప్పుకుంటూ కనిపిస్తారు.
* రక రకాల స్టార్ క్యాంపెయినర్లు బాబు కోసం పని చేస్తారు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడంలో వీళ్లందరూ భాగస్వాములే.
* ఏ అభివృద్ధీ చేయని వారికి, ప్రజలకు ఏ మంచీ చేయని వారికి, ప్రజలకు మోసాలే చేసిన వారికి ఈ రాష్ట్రానికి కూడా అన్యాయం చేసిన వారికి ఇంత మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు గానీ, ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేద ఇంటికీ మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్ క్యాంపెయినర్లూ లేరు.
* కానీ మీ బిడ్డ వీళ్లందరినీ నమ్ముకోలేదు. వీళ్లందరికీ ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాడు.
* వీళ్లందరికన్నా ఎక్కువ స్టార్ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషపడుతున్నాడు.
* మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా? ఈ జెండాలు జతకట్టిన వారంతా అనుకుంటున్నారు.. మీ బిడ్డకకు స్టార్ క్యాంపెయినర్లు లేరని.. వారికీ నాకూ తేడా ఏమిటో తెలుసా?
* కాబట్టే వారికి భిన్నంగా నాకున్నంత మంది స్టార్ క్యాంపెయినర్లు, దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని ఈ సందర్బంగా తెలియజేస్తున్నా.
* మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లు.. ఆ మంచి జరిగిన ఆ ప్రతి ఇల్లూ.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* ఒక వైయస్సార్ ఆసరా అందుకున్న నా అక్కచెల్లెమ్మలంతా 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* సున్నావడ్డీ అందుకున్న కోటి మందికిపైగా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* 57 లక్షల మంది తల్లులు, కోటికిపైగా ఉన్న ఆ పిల్లలు వీళ్లంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* చేయూత అందుకున్న 31 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* 31 లక్షల మంది ఇళ్ల పట్టాలందుకున్న నా అక్కచెల్లెమ్మలు, వాళ్ల కుటుంబాలు, అందులో 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్న ఈ కుటుంబాలన్నీ కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* రైతు భరోసా అందుకుంటున్న అరకోటికిపైగా ఉన్న 52 లక్షల మంది ఆ రైతన్నలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* నెలనెలా పెన్షన్లు అందుకుంటున్న 65 లక్షల మంది నా అవ్వాతాతలు, నా వికలాంగులు, వికలాంగ సోదరులు, అక్కచెల్లెమ్మలు, వితంతు అక్కచెల్లెమ్మలు వీళ్లందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* ఆరోగ్యశ్రీ ద్వారా మంచి జరిగిన 30 లక్షల మంది కుటుంబాలు వీరంతా కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* దిశ యాప్ ద్వారా రక్షణ పొందుతున్న అక్కచెల్లెమ్మలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* ఇంగ్లీషు మీడియం ద్వారా బడులు, బతుకులు మారుతున్నాయని అర్థం చేసుకున్న గవర్నమెంట్ బడి పిల్లలు, వారి తల్లిదండ్రులంతా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* గ్రామంలో వచ్చిన మార్పులు కళ్లారా చూసిన గ్రామీణ ప్రజలందరూ మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* ప్రతి వార్డులోనూ, ప్రతి గ్రామంలోనూ ఆదివారమైనా, సెలవురోజైనా ప్రతి నెలా ఒకటో తేదీన సూర్యోదయానికంటే ముందే తలుపుతట్టి గుడ్మార్నింగ్ చెబుతూ పెన్షన్ డబ్బులు అందజేస్తున్న 2.50 లక్షల మంది వాలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలు సేవా సైన్యం కూడా మీ బిడ్డకు స్టార్ క్యాంపెయినర్లే.
* మీ బిడ్డ మిమ్మల్నే నమ్ముకున్నాడు. చంద్రబాబు మాదిరి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడి అండదండలు లేవు.
* మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని, కింద మిమ్మల్ని తప్ప ఇంకొకర్ని మీ బిడ్డ నమ్ముకోలేదు.
* రాబోయే రోజుల్లో అబద్ధాలు మోసాలు చేస్తారు. కేజీ బంగారం ఇస్తామంటారు. ప్రతి ఇంటికీ బెంజ్ కారు కొనిస్తామంటారు. ఆలోచన చేయమని కోరుతున్నా.
* మీ ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే స్టార్ క్యాంపెయినర్లుగా రండి అని మిమ్మల్నందరినీ కోరుతున్నా. మీ బిడ్డకుసైనికులుగా మీరే నిలబడండి.
* జరగబోయే కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం వేసే ఓటు, మనం నొక్కే బటన్ ఎందుకు నొక్కుతున్నారో గుర్తుపెట్టుకోవాలి.
* జగన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవడం కాదు మీరు వేసే ఓటు.. ఆ ప్రతి పేద కుటుంబం పేదరికం నుంచి బయట పడాలి అంటే మీరు వేసే ఆ ఓటు వల్ల ఆ జగన్ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటేనే జరుగుతుందన్న వాస్తవాన్ని మర్చిపోకండని గుర్తు చేస్తున్నా.
* మంచి చేసే అవకాశం, పరిస్థితులు ఇంకా ఎక్కువ దేవుడు ఇవ్వాలి, మీ పిల్లల బతుకులు ఇంకా బాగుపడాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా.