Saturday, March 14, 2026
Homeసినిమా'దొంగలున్నారు జాగ్రత్త’ అందరికీ నచ్చుతుంది : శ్రీసింహ

‘దొంగలున్నారు జాగ్రత్త’ అందరికీ నచ్చుతుంది : శ్రీసింహ

సురేష్ ప్రొడక్షన్స్‌,  గురు ఫిలింస్‌ సంయుక్త నిర్మాణంలో  డి సురేష్ బాబు, సునీత తాటి నిర్మిస్తున్న చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త‘.  శ్రీ సింహ కోడూరి ప్రధాన కథానాయకుడు. సర్వైవల్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. సెప్టెంబర్ 23న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

శ్రీసింహ మాట్లాడుతూ “నా కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి గొప్ప కాన్సెప్ట్ వచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగులో ఇలాంటి సినిమా ఇంతవరకూ ఎవరూ చేయలేదు. ఇలాంటి ప్రయోగాత్మక చిత్రం కోసం నన్ను ఎంపిక చేసుకున్నందుకు సురేష్ బాబు గారు, సునీత గారు , దర్శకుడు సతీస్ కి కృతజ్ఞతలు. సెప్టెంబర్ 23న సినిమా థియేటర్ కి వస్తుంది. అందరూ థియేటర్ కి వెళ్లి చూస్తారని, ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.

Also Read ‘దొంగలున్నారు జాగ్రత్త’ సెప్టెంబర్ 23న విడుదల

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular