Thursday, March 12, 2026
Homeసినిమాకృష్ణ మృతి పై బాధపడద్దు - వర్మ

కృష్ణ మృతి పై బాధపడద్దు – వర్మ

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అందరూ ఒకలా ఆలోచిస్తే… వర్మ మరోలా ఆలోచిస్తారు. అదే.. ఆయన ప్రత్యేకత. ఎప్పుడూ తన మాటలతో.. ట్వీట్ లతో వార్తల్లో నిలిచే వర్మ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ మరణం గురించి స్పందించి మరోసారి వార్తల్లో నిలిచారు. కృష్ణ మృతి గురించి తనదైన స్టైల్ లో స్పందించారు వర్మ. ఇంతకీ వర్మ ఏమన్నారంటే… కృష్ణ  గారు చనిపోయారని బాధపడనవసరం లేదు. ఇప్పటికే ఆయన, విజయ నిర్మల గారిని స్వర్గంలో కలుసుకుని ఉంటారు. వాళ్లిద్ద‌రూ కలిసి స్వ‌ర్గంలో పాట‌లు పాడుతూ, నృత్యం చేస్తూ ఆనందంగా గడుపుతుంటారని అనుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారాయ‌న‌.

అంతేకాకుండా, ఈ ట్వీట్‌కు మోసగాళ్లకు మోసగాడు చిత్రంలో కృష్ణ‌, విజ‌య‌నిర్మ‌ల క‌లిసి పాడుతూ, డ్యాన్స్ చేసిన వీడియోను జత చేశాడు. ఈ ట్వీట్‌పై నెటిజ‌న్ల నుంచి ఎక్కువ‌గా పాజిటివ్ స్పంద‌నే వ‌చ్చింది. స్వర్గంలో కృష్ణ  కోసం వస్తాడు నా రాజు ఈ రోజు అని విజయ నిర్మల ఈ రోజు  పాట పాడినట్టుందని, అందుకే ఆయ‌న బ‌య‌ల్దేరిన‌ట్టున్నార‌నే స్పంద‌న  నెటిజ‌న్ల నుంచి రావ‌డం విశేషం. కృష్ణ మరణంతో తెలుగు చలనచిత్ర సీమలో ఒక శకం ముగిసింది. మంచితనానికి మారు పేరు కృష్ణ.. అంటూ పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular