Friday, March 28, 2025
HomeTrending Newsబాబు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: పేర్ని నాని

బాబు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: పేర్ని నాని

ఇప్పటిదాకా సామాజిక సాధికారత అన్నది ఒక నినాదంగానే మిగిపోయిందని, కానీ సిఎం జగన్ దాన్ని ఒక విధానంగా మార్చి చూపారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. మహామహులు, సామాజిక సాధికారతకోసం ఎంతగా శ్రమించారో, ఉద్యమాలు చేశారో చరిత్రలో చదువుకున్నామని, వారి ఆశయాలను ఆదర్శాలుగా చేసుకుని జగన్ ముందుకు  సాగుతున్నారని ప్రశంసించారు. దేశ చరిత్రలోనే మైనార్టీలకు రాజకీయంగా, ఆర్థికంగా ఇంత మేలు చేసిన నాయకుడు లేడని స్పష్టం చేశారు.

అనంతపురం అర్బన్‌ నియోజకవర్గంలో జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర విజయవంతమైంది. స్థానిక ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, మంత్రి ఉషా శ్రీచరణ్, మాజీమంత్రి పేర్నినాని, ఎంపీ తలారి రంగయ్య తదితరులు ప్రసంగించారు.

2014 ఎన్నికల్లో నమ్మి బాబు ఓట్లేస్తే చంద్రబాబు ప్రజల్ని నిండా ముంచారని, జగనన్నకు ఓట్లేస్తే…ప్రజల జీవనస్థాయిని పెంచారని మాజీ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు ఆరు హామీలంటూ మళ్లీ చెబుతున్నరని, నమ్మితే మన జీవితాల్ని ఆర్పేస్తారని హెచ్చరించారు.  చంద్రబాబు తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని, పేదరికం పోవాలంటే చదువులు పెరగాలని, అందుకే జగనన్న రూ.70వేల కోట్లు  విద్యపై ఖర్చు చేస్తున్నారని తెలిపారు.

అరకులో 

అరకు నియోజకవర్గంలో వైసీపీని టచ్ చేసే దమ్ము మరే పార్టీకి లేదని, సాధికార యాత్రకు వస్తున్న జనాన్ని చూస్తుంటే ఈ విషయం తేటతెల్లమవుతుందని అరకు ఎంపీ గొట్టేట మాధవి అన్నారు. పొత్తులు పెట్టుకుని టీడీపీ, జనసేన గుంపులు గుంపులుగా వస్తుంటే, జగన్ అన్న ఒక్కరే పోటీకి దిగుతున్నారని, రాష్ట్రమంతటా ఎగిరేది వైసీపీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు.

ఆదివాసీల సీమలో అరకులో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర ఉవ్వెత్తున ఎగసి.. ఉత్సాహంగా సాగింది.  హూకుంపేటలో స్థానిక ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో జిల్లా ఇన్ చార్జి మంత్రి గుడివాడ అమర్ నాథ్, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ సుభద్ర, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎంపీ గొట్టేట మాధవి, జీసీసీ చైర్ పర్సన్ శోభా స్వాతిరాణి, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజులు పాల్గొన్నారు.

నియోజకవర్గ పరిధిలోని ఆరు మండలాల్లో జగన్ సీఎం అయిన తర్వాత రూ. 141 కోట్ల రూపాయలతో నాడు – నేడు పనులు చేపట్టి అభివృద్ధికి బాటలు వేశామని అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ వివరించారు. అలాగే గిరిజన విద్యార్థుల ఉన్నత చదవులు చదువుకోవాలన్న సంకల్పంతో జగన్ గిరిజన ప్రాంతాల్లో సెంట్రల్ యూనివర్శిటీ, ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు చేశాని గుర్తు చేసారు. అలాగే నియోజవర్గంలో రూ. 6వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, బ్రిటీష్ కాలం నుంచి రోడ్లు లేని గ్రామాలకు జగనన్న ప్రభుత్వంలో తారు రోడ్లు వేసి ఆదివాసీ ప్రాంతాలకు మహర్దశను కల్పించారన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్