Tuesday, March 17, 2026
Homeసినిమాఆర్ఆర్ఆర్ ‘దోస్తీ’ పాట అదిరింది

ఆర్ఆర్ఆర్ ‘దోస్తీ’ పాట అదిరింది

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. ప్రెండిషిప్ డే సందర్భంగా ఈ రోజు ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి దోస్తీ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఐదు భాషల్లో ఈ పాటను విడుదల చేశారు. స్వరవాణి కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను తెలుగులో హేమచంద్ర ఆలపించారు.

“పులికి విలుకాడుకి.. తలకి ఉరితాడుకి.. కదిలే కార్చిచ్చుకి.. కసిరే వడగళ్లకి.. రవికీ మేఘానికీ.. దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం.. స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో” అంటూ సాగే ఈ పాట ఇద్ద‌రు భిన్న‌మైన మ‌న‌స్కుల మ‌ధ్య ఉన్న స్నేహాన్ని తెలియ‌జేసేలా సాగింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. ఇదే పాట‌ను తమిళంలో అనిరుధ్‌, హిందీలో అమిత్ త్రివేది, మ‌ల‌యాళంలో విజ‌య్ యేసుదాస్‌, క‌న్న‌డంలో యాజిన్ న‌జీర్ పాడారు. ఈ పాట‌లో కీర‌వాణితో పాటు ఐదు భాష‌ల్లో పాట‌ను పాడిన సింగర్స్ తోపాటు చివ‌ర‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వర్‌ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ కూడా క‌నిపించ‌డం విశేషం. ఈ పాట విన్న వెంటనే ప్రతి ఒక్కరినీ విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ ను చూస్తామా అనే ఆసక్తిని పెంచుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular