Thursday, September 19, 2024
Homeసినిమాబాల‌య్య‌, గోపీచంద్ మూవీ రీమేకా?

బాల‌య్య‌, గోపీచంద్ మూవీ రీమేకా?

Remake? straight?: న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ మ‌లినేని గోపీచంద్ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో బాల‌య్య స‌ర‌స‌న శృతిహాస‌న్ న‌టిస్తుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. అఖండ సినిమా త‌ర్వాత చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సినిమా షూటింగ్ సిరిసిల్లలో ప్రారంభం అయ్యింది.

అయితే.. ఫ‌స్ట్ డే షూటింగ్ రోజునే ఈ షూటింగ్ నుంచి ఓ స్టిల్ లీక్ అయ్యింది. లీకైన ఆ ఫోటో సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యింది. సరే.. ఇదంతా బాగానే ఉన్నప్ప‌టికీ.. ఇక్కడ నుంచే అసలు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. అందులో బాలయ్య గెటప్.. ఆ షూటింగ్ సెటప్.. చూస్తుంటే.. కన్నడ హిట్ మూవీ శివ రాజ్ కుమార్ నటించిన మఫ్టి సినిమా అందరికీ గుర్తొస్తుంది.

దీనితో బాలయ్య చేస్తున్న‌ సినిమా క‌న్న‌డ హిట్ మూవీ మ‌ఫ్టి మూవీకి రీమేక్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. పైగా రెండు సేమ్ స్టిల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీంతో బాల‌య్య‌, గోపీచంద్ మూవీ రీమేకా..?  స్ట్రైయిట్ మూవీనా..? అనేది ఆస‌క్తిగా మారింది. మరి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త పై బాల‌య్య కానీ.. డైరెక్ట‌ర్ గోపీచంద్ కానీ.. క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్