న్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ భారీ స్పోర్ట్స్ డ్రామా ఇటీవల అమెరికా షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో దాదాపుగా షూటింగ్ పూర్తి అయ్యింది. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. 2022 ఆగష్టు 25న లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే… లైగర్ తర్వాత విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్ లో మూవీ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి.
ఆ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమాను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇటీవల సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా విజయ్ దేవరకొండ స్పందిస్తూ… పుష్ప 2 తర్వాత సుకుమార్ తో సినిమా ఉంటుందని కన్ ఫర్మ్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండతో శివ నిర్వాణ మూవీ క్యాన్సిల్ అయిందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనికి కారణం శివ నిర్వాణ గత చిత్రం ‘టక్ జగదీష్’ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోవడంతో, విజయ్ ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.
అయితే… తాజాగా ఈ విషయం పై స్పందించారు దర్శకుడు శివ నిర్వాణ. ప్రచారంలో ఉన్న ఈ వార్తలన్ని నిజం కాదని.. ఇది ఫేక్ న్యూస్ అని క్లారిటీ ఇచ్చారు. అంటే.. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ, శివ నిర్వాణల కాంబినేషన్లో మూవీ ఉందని… ఇప్పటి వరకు దీనికి సంబంధించి వచ్చినవన్ని పుకార్లేనని తేలిపోయింది. టక్ జగదీష్ నిరాశపరచడంతో మళ్ళీ నిన్ను కోరి, మజిలీ లాంటి ఎమోషనల్ లవ్ స్టోరిని తయారు చేస్తున్నారు శివ నిర్వాణ. అయితే… విజయ్ దేవరకొండతో ప్రాజెక్ట్ ఉందని చెప్పాడు కానీ.. ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం చెప్పలేదు. అదీ.. సంగతి.