విశ్వవిఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు, పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్ర ప్రభుత్వ వైద్య సలహాదారుగా నియమితులు కానున్నారు. డా. దత్తాత్రేయుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని నేడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో చేపడుతున్న నాడు-నేడు, వైద్యఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం, తదితర అంశాలపై ఇరువురి మధ్య చర్చజరిగింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యరంగం బలోపేతానికి చేపడుతున్న చర్యలు, క్యాన్సర్ చికిత్స కోసం ఏర్పాటు చేయ తలపెట్టిన విధానాల్లో ప్రభుత్వానికి సలహాలు ఇవాలని సిఎం జగన్ నోరికి విజ్ఞప్తి చేశారు. దీనికి నోరి దత్తాత్రేయుడు అంగీకరించారు. ఈమేరకు ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలని అధికారులను సిఎం ఆదేశించారు.
ఆ తర్వాత నోరి మీడియాతో మట్లాడుతూ…
⦿ క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సిఎం, నేను సుధీర్ఘంగా చర్చించుకున్నాం
⦿ పరస్పరం ఆలోచనలు పంచుకున్నాం
⦿ రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆస్పత్రులు పెడుతున్నారు
⦿ అందులో ఒకటి అత్యాధునికంగా ఏర్పాటచేయాలని సీఎం సంకల్పించారు
⦿ వివిధ మెడికల్ కాలేజీలు, జిల్లా ఆస్పత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను దీనికింద తీసుకురావాలన్నది ఆలోచన
⦿ క్యాన్సర్ రోగులందరికీ అందుబాటులో ఉండేలా చికిత్సలను తీసుకురావాలన్నది సిఎం ఉద్దేశం
⦿ క్యాన్సర్ చికిత్స కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలన్నది సిఎం సంకల్పం
⦿ రాష్ట్రానికి తగిన సహాయసహకారాలు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని సిఎం కు చెప్పాను
⦿ దీనికి ముఖ్యమంత్రిగారు సంతోషించారు
⦿ సిఎంతో సమావేశంద్వారా రాష్ట్రంలో క్యాన్సర్ చికిత్సా విధానంలో గొప్ప అడుగు పడింది
⦿ ఆరోగ్య రంగంలో సిఎం జగన్ తీసుకున్న చర్యలన్నీ నాకు చాలా నచ్చాయి
⦿ మెడికల్ కాలేజీలను, జిల్లా ఆస్పత్రులను బాగుచేయడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది
⦿ క్యాన్సర్ చికిత్స కోసం పెద్దనగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చూడాలన్నది అయన ఆలోచన
అని దత్తాత్రేయుడు వెల్లడించారు.