Tuesday, March 10, 2026
Homeసినిమా రాజశేఖర్ 'శేఖర్' షూటింగ్ షురూ

 రాజశేఖర్ ‘శేఖర్’ షూటింగ్ షురూ

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ బ్యానర్లపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు లలిత్ మాట్లాడుతూ… “కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో చిత్రీకరణ పునఃప్రారంభించాం. ఇందులో హీరో రాజశేఖర్ గారితో పాటు హీరోయిన్ అను సితార, ఇతర ప్రధాన తారాగణం పాల్గొంటారు. కీలక సన్నివేశాలను తెరకెక్కించడానికి ప్లాన్ చేశాం. రాజశేఖర్ గారి సరసన మరో కథానాయికగా ‘జార్జ్ రెడ్డి’ ఫేమ్ ముస్కాన్ కుబ్ చాందిని నటిస్తున్నారు” అని చెప్పారు.

నిర్మాతలు మాట్లాడుతూ.. “రాజశేఖర్ గారి 91వ చిత్రమిది. ఇప్పుడు ఈ అరకు షెడ్యూల్ తో 75 శాతం సినిమా పూర్తవుతుంది. సుమారు 20 రోజుల పాటు, నెలాఖరు వరకు అరకులో షూటింగ్ చేస్తాం. ఆ తర్వాత హైదరాబాద్ లో ఐదు రోజులు షూటింగ్ చేశాక… శ్రీశైలం లేదా నాగార్జున సాగర్ లో వారం షెడ్యూల్ ప్లాన్ చేశాం” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular