Tuesday, March 17, 2026
Homeసినిమాసైలెంట్ అయిపోయిన రాజశేఖర్!

సైలెంట్ అయిపోయిన రాజశేఖర్!

ఒకప్పుడు స్టార్ హీరోగా రాజశేఖర్ ఒక వెలుగు వెలిగారు. యాంగ్రీ యంగ్ మెన్ బిరుదును చాలా కాలం పాటు ఆయన నిలబెట్టుకున్నారు. యాక్షన్ విషయంలో తనదైన మార్క్ చూపిస్తూనే, ఫ్యామిలీ  ఆడియన్స్ కి చేరువయ్యారు. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలను పోషించడంలో తన తరువాతనే ఎవరైనా అనుకునేలా దూసుకెళ్లారు. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను కూడా గొప్పగా పలికించగల నటుడిగా క్రేజ్ తెచ్చుకున్నారు.

అలాంటి రాజశేఖర్ కి కాలక్రమంలో అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. నిర్మాణ భాగస్వామిగా ఉంటూ కొన్ని సినిమాలు .. నిర్మాతగా మరికొన్ని సినిమాలను ఆయన చేస్తూ వెళ్లారు. అయితే ఆ సినిమాలు ఆశించినస్థాయిలో ఆడకపోవడం వలన, ఆర్ధికంగా ఇబ్బందులు పడ్డారు. ఆయన నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమా ‘శేఖర్’ మాత్రమే. ఈ సినిమా కూడా థియేటర్ కి వెళ్లిన తరువాత ఇబ్బందులు తెచ్చిపెట్టింది. నిజానికి అది కూడా సింపుల్ కంటెంట్ తో .. తక్కువ బడ్జెట్ లో చేసిన రీమేక్.

‘శేఖర్’ సినిమా తరువాత రాజశేఖర్ సైలెంటయ్యారు. ఈ సినిమాతో పాటు మరో రెండు ప్రాజెక్టులు ఆయన చేతిలో ఉండాలి. కానీ వాటి ప్రస్తావన ఎక్కడా వినిపించడం లేదు. వేరే ప్రాజెక్టులకు సంబంధించిన కథలను సెట్ చేసుకుంటున్నారా? లేదంటే విలన్ గా మారడానికి అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడున్న ట్రెండ్ లో పెద్ద పెద్ద స్టార్స్ సైతం విలన్ రోల్స్ చేయడానికి వెనకాడకపోవడం చూస్తున్నదే. అలా విలన్ గా రాజశేఖర్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular