Friday, September 20, 2024
HomeTrending NewsCM Jagan: డ్రోన్ల వినియోగంతో బహుళ ప్రయోజనాలు

CM Jagan: డ్రోన్ల వినియోగంతో బహుళ ప్రయోజనాలు

వ్యవసాయ రంగంలో డ్రోన్లను విస్తృతంగా వినియోగించాలని,  డ్రోన్‌ టెక్నాలజీ ద్వారా  బహుళ ప్రయోజనాలు పొందాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.  ఇప్పటికే వీటి ద్వారా  పురుగుమందులు చల్లుతున్నామని … భూసార పరీక్షలు  కూడా పూర్చేతిగా యించే పరిస్థితిని తీసుకురావాలని నిర్దేశించారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో  వ్యవసాయ, ఉద్యానవనశాఖలపై  సిఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

10వేల ఆర్బీకేల్లో 10వేల డ్రోన్లు తీసుకు వచ్చి వాటితో వ్యవసాయరంగంలో మార్పులు తీసుకురావాలని, ఆర్బీకే స్థాయిలో భూసార పరీక్షలు చేసే స్థాయికి ఎదగాలని, తద్వారా ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను సమర్థవంతంగా అమలు చేసే అవకాశం ఉంటుందని,  డేటా కూడా కచ్చితత్వంతో వస్తుందని అభిప్రాయపడ్డారు.  ముందస్తుగా 2వేల డ్రోన్లు తీసుకు వస్తున్నామని,  డ్రోన్‌ టెక్నాలజీలో 222 రైతులకు శిక్షణ ఇచ్చి.. పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నామని అధికారులు సిఎంకు వివరించారు.

సమీక్ష సందర్భంగా సిఎం చేసిన ముఖ్య సూచనలు:

  • జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగంగా కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం, వీరికి రైతు భరోసా అందేలా చర్యలు తీసుకోవాలి
  • వైయస్సార్‌ ఉచిత పంటలబీమా దేశానికి ఆదర్శంగా నిలిచింది, ఇప్పటివరకూ రూ. 7802.5 కోట్లు 54.48 లక్షల మందికి పరిహారంగా అందించాం
  • సాగులో శిక్షణ కార్యక్రమాలపై మరిన్ని వీడియోలు రూపొందించి ఆర్బీకే ఛానెల్‌ ద్వారా మరింతగా రైతులకు చేరువ చేయాలి
  • గోడౌన్లు, కలెక్షన్‌ సెంటర్లు, కోల్డ్‌ రూమ్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేయడం పై దృష్టి పెట్టాలి
  • వివిధ జిల్లాల్లో పండుతున్న పంటల ఆధారంగా ఇప్పటికే పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు మొదలుపెట్టాం,  త్వరలో కొన్ని యూనిట్లు అందుబాటులోకి రానున్నాయి
  • ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యే టమోటా, ఉల్లిలాంటి పంటల ప్రాసెసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టాలి
  • మహిళలతో నడిచే సెకండరీ ప్రాసెసింగ్‌ యూనిట్లను తీసుకొచ్చే ప్రయత్నంచేయాలి
  • ధాన్యం సేకరణలో ఆర్బీకేల ద్వారా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేశాం.
  • కనీస గిట్టుబాటు ధరలు రాని ఏ పంట కొనుగోళ్లులో అయినా ఆర్బీకే జోక్యం చేసుకుంటుంది
  • విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు వేటిలోనూ నకిలీలు, కల్తీ లేకుండా నివారించడంలో ఆర్బీకేలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.
  • ఇప్పుడు మార్కెటింగ్‌లో కూడా ఆర్బీకేలు ప్రమేయం ఉండాలి
  • ప్రభుత్వం వ్యవసాయ ఉపకరణాలు, డ్రయ్యింగ్‌ ప్లాట్‌ఫాంలతో పాటు ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తుంది.
  • ఇతర పంటలకు కూడా మార్కెట్‌తో సమన్వయం చేసి.. మధ్యవర్తుల ప్రమేయాన్ని నిరోధించాలి. ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలి
RELATED ARTICLES

Most Popular

న్యూస్