Sunday, January 19, 2025
Homeసినిమాదుల్క‌ర్ స‌ల్మాన్‌ బర్త్ డే కు `లెఫ్టినెంట్ రామ్‌` గ్లిమ్స్ రిలీజ్

దుల్క‌ర్ స‌ల్మాన్‌ బర్త్ డే కు `లెఫ్టినెంట్ రామ్‌` గ్లిమ్స్ రిలీజ్

వెర్స‌టైల్ యాక్ట‌ర్ దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ఆయ‌న న‌టించిన మొద‌టి సినిమా `మ‌హాన‌టి` ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే బ్యాన‌ర్ స్వ‌ప్న సినిమా ప‌తాకం పై దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా మ‌రో సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్‌ గా దుల్క‌ర్‌ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినిద‌త్ నిర్మిస్తున్నారు.

ఈ రోజు (జులై28) దుల్కర్ బర్త్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. తాజాగా ఓ గ్లిమ్స్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లిమ్స్ లో దుల్క‌ర్ స‌ల్మాన్ ఆక‌ట్టుకున్నారు. ఇది త‌న పుట్టినరోజుకి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్క‌ర్ తెలిపారు. ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సార‌థ్యంలో కాశ్మీర్‌లోని ప‌లు అంద‌మైన లోకేష‌న్స్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. హార్ట్ ట‌చింగ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ప్ర‌సిద్ది చెందిన హను రాఘ‌వ‌పూడి మ‌రో ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌ చేసిన పోస్ట‌ర్లో దుల్క‌ర్ స‌ల్మాన్ చేతిలో ఒక లెట‌ర్ ప‌ట్టుకుని న‌వ్వుతూ సైకిల్‌మీద కూర్చొని ఉన్నాడు. భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్