Sunday, February 23, 2025
HomeTrending Newsహైదరాబాద్ పోలీసుల బంపర్ ఆఫర్

హైదరాబాద్ పోలీసుల బంపర్ ఆఫర్

మార్చి 1నుండి ట్రాఫిక్ చెలన్స్ క్లియర్ చేయడానికి రాయితీ ఇస్తున్నామని హైద్రాబాద్ ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ ప్రకటించారు. ఇది ఒక నెల వరకు ఉంటుందని, వాహనదారులందరు కోవిడ్ నేపథ్యంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో లోకదాలత్ ద్వారా ఈ రాయితీ కేటాయించామని హైదరాబాద్ లో ఈ రోజు తెలిపారు. కోవిడ్ మాస్క్ కేసుల్లో 1000 రూపాయలకు గాను 100 రూపాయల రాయితీ ఇస్తున్నామని, పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఈ వెసులుబాటు కల్పించామన్నారు. ప్రతి చాలను మీ సేవా,ఆన్లైన్ ద్వారా ,తెలంగాణ ఈ చాలాన్ ద్వారా పే చేయవచ్చని చెప్పారు. ఈ ప్రక్రియ నెలపాటు ఉంటుందని, ఈ అవకాశాన్ని అందరూ వాహనదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ట్రాఫిక్ చాలాన్ కట్టుకునే అవకాశముందని, నెలరోజుల్లో కట్టలేని వారికి మరో వెసులుబాటు కల్పించడాకిని కృషి చేస్తామని జాయింట్ కమిషనర్ ఏ. వి.రంగనాథ్ పేర్కొన్నారు. వెసులుబాటు కల్పించడం వల్ల కఠిన చర్యలు ఉండవని బావించవద్దని స్పష్టం చేశారు. తద్వారా ట్రాఫిక్ కఠిన నిబంధనలు అమలు అవుతాయని, అయితే ఆన్ లైన్ ద్వారానే పెండింగ్ చలాన్ చెల్లించాలని, ఈ చాలన్ సిస్టమ్ ద్వారా అన్ని పెండింగ్ చలన్ లు చెల్లించాలని చెప్పారు. ఆన్లైన్ అనగా ఫోన్ పే & పే టీం ఏం & గూగుల్ పే వంటి సేవలు ఉపయోగించుకోవచ్చని లేదా మీ సేవ ఈ సేవ లో చెలించవచ్చన్నారు.

రేపటి నుంచి మార్చి 30 వ తేది వరుకు ట్రాఫిక్ చలనాలు రాయితీ అమలు అవుతుందని, ద్విచక్ర వాహనలకి 25 శాతం రాయితీ, హైదరాబాద్ లోనే కేవలం 500 కోట్ల రూపాయల చాలన్ ల వరకు 1.75 లక్షల చలనాలు పెండింగ్ లో ఉన్నాయన్నారు. నెల రోజుల వేసులబాటులో చలాన్ కట్టకపోతే  ఆ తర్వాత తగిన చర్యల కోసం స్పెషల్ డ్రైవ్ పెదతామన్నారు. ఆటోల వ్యవహారంలో హైదరాబాద్ సిటీలో పెర్మిషన్ ఉన్నవి ఉంటే పరవాలేదు.. బయట జిల్లాల నుంచి వచ్చే వాటి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఆటోలో మీటర్ వేసే పరిస్థితి లేదని దీనిపై ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని, ఈ విషయం ఆటో యూనియన్ లకి సమచారం ఇచ్చామని చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్