Saturday, January 18, 2025
HomeTrending Newsసిఎంతో నేవీ అధికారుల భేటి

సిఎంతో నేవీ అధికారుల భేటి

Eastern Naval Command Officers Met Ap Cm Jagan At Tadepalli :

తూర్పు నావికా దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ ఛీఫ్, వైస్‌ అడ్మిరల్‌ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  డిసెంబర్‌ 4న విశాఖలో జరిగే నేవీ డే వేడుకలకు సిఎం ను ఆహ్వానించారు.

ఏపీ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ సిటీ పేరుతో ముంబైలో నావికాదళ యుద్దనౌక ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం త్వరలో ప్రారంభం కానుందని సీఎంకి నేవీ అధికారులు వివరించారు. ఫిబ్రవరి 2022లో జరగనున్న పిఎఫ్‌ఆర్‌ అండ్‌ మిలన్‌ 2022 నిర్వహణకు సంబంధించిన సన్నాహకా ఏర్పాట్లపై, కూడా ముఖ్యమంత్రికి వివరించారు.సిఎం జగన్ అజేంద్ర బహదూర్‌ సింగ్‌ను సన్మానించి, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు.

ముఖ్యమంత్రిని కలిసినవారిలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ వికాస్‌ గుప్తా, సివిల్‌ మిలటరీ లైజన్‌ ఆఫీసర్‌ కమాండర్‌ సుజిత్‌ రెడ్డి, ఫ్లాగ్‌ లెఫ్టినెంట్‌ శివమ్‌ కందారి కూడా ఉన్నారు.

Must Read :ధాన్యం సేకరణకు పటిష్ట విధానం : సిఎం జగన్‌

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్