Monday, March 9, 2026
HomeTrending NewsEC appoints: గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి

EC appoints: గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి

రాష్ట్రంలో ఇటీవల విధులనుంచి  తొలగించిన  కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గుంటూరు రేంజ్ ఐజి నియామకం కూడా చేపట్టింది.

మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు ఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం కృష్ణా కలెక్టర్ గా కె.బాలాజీ, అనంతపురం కలెక్టర్‌గా వినోద్ కుమార్, తిరుపతి కలెక్టర్‌గా ప్రవీణ్ కుమార్ నియమించింది..

గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠిని ఎంపిక చేసింది. ప్రకాశం ఎస్పీగా సుమిత్ సునీల్, పల్నాడు ఎస్పీగా గరికపాటి బిందుమాధవ్, చిత్తూరు ఎస్పీగా మణికంఠ చందోలు. అనంతరపురం ఎస్పీగా అమిత్ బద్దార్, నెల్లూరు ఎస్పీగా అరీఫ్ హఫీజ్ నియమించింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు రాత్రి ఎనిమిది గంటలల్లోపు ఈ అధికారులు బాధ్యతలు చేపట్టాలని ఈసీ ఆదేశించింది.

రెండు రోజుల క్రితం ఐదు జిల్లాల ఎస్పీలు, గుంటూరు రేంజ్ ఐజీ, ముగ్గురు కలెక్టర్లను ఈసీ బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆరోపణల నేపథ్యలో వీరిని బదిలీ చేసి, కొత్తవారిని కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular