Saturday, January 18, 2025
HomeTrending Newsఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్

ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్ట్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో టిఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఈ మధ్యాహ్నం కవిత ఇంటికి చేరుకున్న ఐటి, ఈడీ బృందం తొలుత సోదాలు చేపడుతున్నట్లు లీక్ ఇచ్చింది. అయితే వారు అదుపులోకి తీసుకునేందుకే ముందస్తుగానే ఈ రాత్రి 8.45 గంటలకు  ఢిల్లీకి విమానం టిక్కెట్లు రిజర్వు చేసుకుని వచ్చింది. కొంతసేపు సోదాల అనంతరం సాయంత్రం ఐదున్నరకు ఆమె అరెస్టు విషయాన్ని ఈడీ ధృవీకరించింది.  అరెస్టు నోటీసును కవిత భర్త అనిల్ కు అందించింది. ఈ విషయం తెలిసిన వెంటనే కవిత సోదరుడు, టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అక్కడకు చేరుకున్నారు. కొద్ది సేపు గేటు వద్దే వారిని నిలువరించి కాసేపటికి లోపలి అనుమతించారు.

ఈ కేసు విషయమై సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగానే ఎలా అరెస్టు చేస్తారని కేటిఆర్ అధికారులను ప్రశ్నించారు. దీనిపై కాసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కవిత లాయర్ సోమా భరత్ ను కూడా ఈడీ లోపలకు అనుమతించలేదు.

కవితను రేపు ఉదయం రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. తొలుత 14 రోజులపాటు రిమాండ్ విధిస్తారని న్యాయవిశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని కారు వద్దకు తరలిస్తున్న తరుణంలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. కొడుకును ముద్దు పెట్టుకొని కిందకు దిగిన ఆమె కారులో కూర్చున్న తరువాత భర్తను హత్తుకున్నారు. కేటిఆర్, హరీష్ రావు తో పాటు, కేసిఆర్ భార్య శోభ ఆమెకు ధైర్యం చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్