Wednesday, March 18, 2026
HomeTrending Newsక్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు

క్యాసినో వ్యవహారంలో ఈడీ దాడులు

హైదరాబాద్ లో ఈ రోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు జరుగుతున్నాయి. క్యాసినో వ్యవహారంలో ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. గతంలో గుడివాడ క్యాసినో కేసులో ప్రవీణ్ పై ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లో మొత్తం 8చోట్ల ఈడీ దాడులు జరుగుతున్నాయి. గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‌పై ఆరోపణలు నేపథ్యంలో ఫెమా కింద కేసు నమోదు చేసింది ఈడీ.

చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఉదయం నుంచి ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. గతంలో గుడివాడ క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్‍పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐఎస్ సదన్ లొ చికోటి ప్రవీణ్ ఇంట్లో ఈడీ సోదాలు చేస్తుండగా బోయిన పల్లిలో మాధవరెడ్డి ఇంటి ఫై ఈడీ సోదాలు జరుగుతున్నాయి. జూన్ 10, 11,12,13 తేదీలలో నేపాల్ లోని హోటల్ మేచీ క్రౌన్ లో కేసీనో నిర్శహించిన మాధవ రెడ్డి.

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానాల ద్వారా నేపాల్ కు పేకాట రాయిళ్ళను తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇండో- నేపాల్ సరిహద్దు నగరం సిలిగురిలో క్యాసినో శిబిరాలు నిర్వహించటం, నేపాల్ , ఇండోనేషియా, పుక్కెట్ లో క్యాసినోలు నిర్వహించినట్లు గుర్తించిన ఈడి. క్యాసినో లలో టాలివుడ్ , బాలీవుడ్ , నేపాలీ డ్యాన్సర్లతో చిందులు వేయించారని ఈడికి ఫిర్యాదులు అందాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular