Saturday, January 18, 2025
Homeతెలంగాణనామా పై ‘ఈడి’ సోదాలు

నామా పై ‘ఈడి’ సోదాలు

టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వర రావు ఇళ్లు, కార్యాలయాలలో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సోదాలు నిర్వహిస్తోంది. నామా కు చెందిన ‘మధుకాన్’ కంపెనీ డైరెక్టర్లు, ఆడిటర్ల నివాసాలలో కూడా సోదాలు జరుగుతున్నాయి.కీలక పత్రాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎంపి నామా సమక్షంలోనే అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. అనంతరం నామా స్టేట్ మెంట్ ను కూడా రికార్డు చేయనున్నారు.

2011 లో రాంచి-జంషెడ్ పూర్ హైవే నిర్మాణ కాంట్రాక్టు మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి 1,064 కోట్ల రూపాయల రుణాన్ని కంపెనీ పొందింది. అయితే వాటిలో కొన్ని నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకపోవడంతో రాంచి హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన రాంచి హైకోర్టు దీనిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కింద విచారణ జరపాలని ఆదేశించింది. 2019లో కేసు దాఖలు చేసిన సిబిఐ 2020 లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ఎఫ్ ఐ ఆర్ లో సంస్థ డైరెక్టర్ లు శ్రీనివాసరావు, సీతయ్య, పృథ్వీ తేజ్ ల పేర్లు కూడా చేర్చింది, ఈ ప్రాజెక్టు నుంచి మధుకాన్ కంపెనీని తొలగించింది జార్ఖండ్ ప్రభుత్వం. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు. జూబ్లీ హిల్స్ లోని నామా నివాసంతో పాటు హైదరాబాద్ లని డైరెక్టర్ల నివాసాలు, ఖమ్మంలో నామా నివాసం, కార్యాలయాల్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాలపై నేటి రాత్రికి ఈడి ఓ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్