Sunday, March 15, 2026
HomeTrending NewsED Raids:హైదరాబాదులో పలుచోట్ల ఈడి సోదాలు

ED Raids:హైదరాబాదులో పలుచోట్ల ఈడి సోదాలు

హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఈడి సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం 6 గంటల సమయంలో జూబ్లీహిల్స్, మాదాపూర్ లో దాదాపు 15 బృందాలుగా ఏర్పడి ఈడి అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ప్రముఖ ఫార్మా కంపెనీపై దాడులు నిర్వహిస్తుంది. ఈ తెల్లవారు జాము నుంచే ఏకకాలంలో బృందాలుగా విడిపోయి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎండీ శ్రీధర్‌రావు నివాసంలోనూ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాహితీ ఇన్ ఫ్రా సంబంధించిన సంస్థల్లో ఈడీ సోదాలు సాగుతున్నాయి. ఎనిమిది ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు.

ఫార్మా కంపెనీకి సంబంధించిన డైరెక్టర్ల ఇల్లు, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈడి అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో మొత్తం పదిహేడు చోట్ల సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్, మాదాపూర్, పటాన్ చెర్వు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పక్కా సమాచారం మేరకే సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. సోదాల్లో పలు కీలక పత్రాలను కూడా కొన్ని చోట్ల అధికారులు స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular