కేజీ నుంచి పీజీ వరకు అంతా ఆన్లైన్ క్లాసులు మాత్రమె నిర్వహించాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ప్రకటించారు. ఆఫ్ లైన్ తరగతులు ప్రారంబించాలనుకున్నా కరోన నేపథ్యంలో ఆన్లైన్ తరగతులే నిర్వహించాలని సీఎం చెప్పారని మంత్రి వెల్లడించారు. సెట్ పరీక్షలు యధాతథంగా ఉంటాయన్న మంత్రి దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందన్నారు. రికార్డు చేసిన పాఠాలు అన్ని టి శాట్ యప్స్ లో అందుబాటులో ఉంటాయన్నారు.
డిగ్రీ, పిజి, డిప్లొమా పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామన్నారు. 46 జిఓ యధాతథంగా అమలు అవుతుందని, ఈ అంశం ప్రైవేటు విద్యా సంస్థలు పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ఏడాది కూడా నెలవారిగా ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని 30% తగ్గించుకోమని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలను కోరారు. పరిస్థితి లు చక్కబడ్డాక ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామని, ద్వితీయ సంవత్సరం పలితాల క్రైటీరియా నచ్చక పోతే ఆ విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి సబితా స్పష్టం చేశారు.