Sunday, January 19, 2025
Homeసినిమారాధేశ్యామ్ స్టోరీ చెబుతున్న‌ 'ఎవరో వీరెవరో...' వీడియో విజువల్స్

రాధేశ్యామ్ స్టోరీ చెబుతున్న‌ ‘ఎవరో వీరెవరో…’ వీడియో విజువల్స్

Visual Feast: రాధేశ్యామ్‌ సినిమాలోని ఎవరో వీరెవరో.. కలవని ఇరు ప్రేమికులా… పాట ఆల్రెడీ విడుదలైంది. ఇది వరకే లిరికల్‌గా రిలీజై సమ్‌థింగ్‌ కొత్తగా అనిపించిన ఈ పాట ఇప్పుడు విజువల్‌ ట్రీట్‌గా హల్‌చల్‌ చేస్తోంది. అనుకోకుండా ఓ గోడ మీద డ్రాయింగ్‌తో మొదలైన ఇద్దరి పరిచయం, దాని చుట్టూ జరిగిన కథ, వాళ్లిద్దరూ పక్కపక్కనే ఉన్నా, ఒకరికొకరు తారసపడని తీరు… ఆఖరిగా కలుస్తారేమో అనుకున్న సమయంలో వాళ్లను విధి ఎలా విడదీసింది వంటివన్నీ పాటలో ఆసక్తికరంగా సాగిన దృశ్యాలు.

ఎక్కడికక్కడ కలర్‌ఫుల్‌గా, చాలా రిచ్‌గా తెరకెక్కించారు దర్శకుడు రాధాకృష్ణకుమార్‌. హీరో ప్రభాస్‌, హీరోయిన్‌ పూజా హెగ్డే ఈ సాంగ్‌లో నయా లుక్స్ తో ఆకట్టుకున్నారు. డిఫరెంట్‌ కలర్స్, సరికొత్త లొకేషన్స్ తో చూడగానే అంచనాలు పెంచుతోంది పాట. సినిమాలో ఈ పాటకు మరింత ప్రాధాన్యం ఉందంటున్నారు నిర్మాతలు వంశీ, ప్రమోద్‌. యు.వి.కృష్ణంరాజు సమర్పిస్తున్న సినిమా రాధేశ్యామ్‌. పోస్ట్ ప్రొడక్షన్‌ పూర్తి కావచ్చింది.  మార్చి 11న సినిమా విడుదల కానుంది. గోపికృష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్