Thursday, March 19, 2026
Homeసినిమా'పుష్ప'తర్వాత స్థానంలో 'ఏకమ్'

‘పుష్ప’తర్వాత స్థానంలో ‘ఏకమ్’

Good Going: ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై యువప్రతిభాశాలి “వరుణ్ వంశీ.బి”ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం “ఏకమ్”. “ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్” అన్నది ఉప శీర్షిక. అమెజాన్ ప్రైమ్ లో లభ్యమవుతున్న ఈ చిత్రం ఉత్తమాభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ భరణి, అదితి మ్యాకల్, కల్పిక గణేష్, దయానంద్ రెడ్డి ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రం… యువదర్శకుడు వరుణ్ వంశీపై ప్రశంసల వర్షం కురిపిస్తోంది.  అమెజాన్ ప్రైమ్ లో మొదటి స్థానంలో ఉన్న “పుష్ప” సరసన సగర్వంగా సెకండ్ ప్లేస్ లో నిలిచి అందరి దృష్టి విశేషంగా ఆకర్షిస్తోంది.

అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన “ఏకమ్” కేవలం పదిహేను రోజుల్లో టాప్-2కి చేరి… మొదటి స్థానం కోసం “పుష్ప”తో పోటీ పడుతోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా… తాత్విక చింతనకు ఆధునికత జోడించి తెరకెక్కిన “ఏకమ్” చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఈ సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ… “ఏకమ్” చిత్రానికి అమెజాన్ లో రెండో స్థానం దక్కడం కలలా ఉంది… చాలా గర్వంగానూ ఉంది. ఇంత వరకు తెలుగులో రాని యూనీక్ జోనర్ లో రూపొందిన “ఏకమ్” చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా వస్తుండడం మరీ సంతోషంగా ఉంది” అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular