Thursday, September 19, 2024
HomeTrending Newsపల్నాడు ఎస్పీగా మలికా గార్గ్, అనతపురంకు గౌతమి శాలి

పల్నాడు ఎస్పీగా మలికా గార్గ్, అనతపురంకు గౌతమి శాలి

పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు నూతన ఎస్పీలను నియమిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 13న జరిగిన అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా, ఆ తరువాత  ఈ మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపారంటూ పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దార్ లను సస్పెండ్ చేసిన ఎన్నికల సంఘం, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ ను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

ఈ మూడు జిల్లాల్లో నియమించేందుకు మూడేసి పేర్ల చొప్పున నివేదిక పంపాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కె. జవహర్ రెడ్డికి సూచించింది. ఆయన పంపిన పేర్లనుంచి  పల్నాడు జిల్లా ఎస్పీగా మలికా గార్గ్‌; అనంతపురం ఎస్పీగా గౌతమీ శాలి; తిరుపతి జిల్లా ఎస్పిగా హర్షవర్ధన్ రాజులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.

మలికా గార్గ్ రెండున్నరేళ్ళపాటు ప్రకాశం జిల్లా ఎస్పీగా పని చేశారు. అనంతరం ఆమెను తిరుపతి ఎస్పీగా బదిలీ చేశారు కానీ 20 రోజులకే ఆమెని సిఐడి ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

హర్షవర్ధన్ రాజు గతంలో విజయవాడ డిసిపిగా పని చేశారు. తర్వాత అన్నమయ్య జిల్లా ఎస్పీగా పని చేశారు. అనంతరం సిఐడి ఎస్పీగా పని చేస్తున్నారు. ప్రస్తుతం బీహార్ ఎన్నికల అబ్జర్వర్ గా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది.సమర్థవంతమైన ఎస్పీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి తిరుపతి జిల్లాకు హర్షవర్ధన్ రాజును నియమించింది.

అనకాపల్లి ఎస్పీగా పని చేసిన గౌతమీ శాలి ఆ తరువాత ఏపీ ఎస్పీ 16వ బెటాలియన్ విశాఖపట్నం కమాండంట్ గా… ప్రస్తుతం విజయనగరంలోని ఏపీ ఎస్పీ 5వ బెటాలియన్ ఎస్పీగా పనిచేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్