Saturday, November 23, 2024
HomeTrending NewsTDP: ఓటర్ల జాబితాలో అక్రమాలపై క్షేత్ర స్థాయి పర్యటన

TDP: ఓటర్ల జాబితాలో అక్రమాలపై క్షేత్ర స్థాయి పర్యటన

జగన్ సిఎం అయిన తరువాత రాష్ట్రంలో దాదాపు 30 లక్షల ఓట్లు తొలగించారని, ఇవి కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనే తీసేశారని  టిడిపి నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి  నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. భారత రాజ్యాంగం కుల, మత,  భాష, లింగ, జాతి బేధం లేకుండా అందరికీ  ఓటు హకు కల్పించిందని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఇది ఓ ఆయుధమని చిన రాజప్ప అన్నారు. మంగళగిరి లోని టిడిపి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

 పలు ఆధారాలతో తాము కేంద్ర ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని, వారు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని పిలిచి మందలించారని చెప్పారు. బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారానే ఓట్లు తొలగించాల్సి ఉన్నా, గ్రామ వాలంటీర్ల ద్వారానే తొలగింపు, చేర్పుల ప్రక్రియను చేపడుతున్నారని విమర్శించారు.  ఎన్నికల జాబితాను సక్రమంగా తయారు చేయాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదేనని, వారు వెంటనే అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ సానుభూతిపరులకు 18 ఏళ్ళు నిండక పోయినా చేరుస్తున్నారని, కానీ టిడిపి వారివి మాత్రం ఏదో సాకుతో తిరస్కరిస్తున్నారని వెల్లడించారు.  చంద్రబాబు సూచన మేరకు కార్యకర్తలు, నేతలందరం 21నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటించి బిఎల్ఓలను కలిసి తప్పొప్పులను సరిచేయించే కార్యక్రమంలో పాల్గొంటామని వివరించారు. వాలంటీర్లపై నమ్మకం లేదని, అందుకే తాము కార్యకర్తలకు వెన్నంటి ఉండి ఓటర్ల జాబితా ప్రక్రియ సవ్యంగా జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో ప్రజల భద్రత ప్రమాదంలో పడిందని, వాలంటీర్ల ద్వారా సేకరించిన వ్యక్తిగత సమాచారాన్ని, చివరకు బ్యాంకు అకౌంట్లను కూడా ప్రైవేట్ కంపెనీల చేతుల్లోకి వెళుతున్నాయని చినరాజప్ప ఆందోళన వ్యక్తం చేశారు.  ఏదో విధంగా వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో వెళ్లాలని జగన్ అనుకోవడం లేదని ఫైర్ అయ్యారు.

వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోయాయని, ఆ పార్టీ నాయకత్వం వీటిని నియంత్రించే పరిస్థితి లేదని,  ఈ పరిణామాలు ఎలా ఉన్నా ప్రజలు మాత్రం తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే నిర్ణయానికి వచ్చారని నిమ్మకాయల ధీమా వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్