Saturday, January 18, 2025
HomeTrending Newsఎన్నికల సంఘానికి బాబు వైరస్ : సజ్జల ఆరోపణ

ఎన్నికల సంఘానికి బాబు వైరస్ : సజ్జల ఆరోపణ

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్)ను తప్పించాలన్న కుట్ర తెలుగుదేశం పార్టీ ఎప్పటినుంచో చేస్తోందని… తమ దారికి రాకపోతే ఎదో విధంగా టెర్రరైజ్ చేయాలని చూస్తున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కారదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. సిఎస్ పై భూకబ్జా ఆరోపణలు కూడా వారి కుట్రలో భాగమేనని, కౌంటింగ్ కు ముందు ఆయన్ను ఎలాగోలా లేకుండా చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. నిష్పక్షపాతంగా అంపైరింగ్ చేయాల్సిన ఎన్నికల సంఘం… కూటమి ఏర్పాటు తరువాత ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అభ్యంతరం వ్వ్యక్తం చేశారు. బహుశా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో తెలుగుదేశం  పొత్తు పెట్టుకున్న కారణంగానే ఇలా చేస్తున్నారేమోననే అనుమానం కలుగుతోందన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఎన్నికల కోడ్ వచ్చిన తరువాత తాము నిబంధనలు పాటిస్తూ వస్తున్నామని… కానీ ఎన్నికల సంఘానికి మాత్రం బాబు వైరస్ సోకినట్లు అనిపిస్తోందని సజ్జల ఘాటుగా వ్యాఖ్యానించారు.  అధికారులను అడ్డం పెట్టుకొని టిడిపి అనేక అక్రమాలకు పాల్పడుతుందని… కానీ ఇవన్నీ తాత్కాలికం మాత్రమేనని, కౌంటింగ్ తరువాత తామే అధికారంలోనే ఉంటామని…. ఇప్పుడు తప్పులు చేస్తున్న అధికారుల తీరుపై సమీక్ష జరుపుతామని స్పష్టం చేశారు.

మాచర్ల, పిన్నెల్లి లక్ష్యంగానే రాష్ట్ర రాజకీయాలను తిప్పాలని ఎల్లో మీడియా, తెలుగుదేశం పార్టీలు ప్రయత్నిస్తున్నాయని… అసలు ఈసీకి తెలియకుండా ఈ వీడియో ఎలా బైటకు వచ్చిందని… ఒకవేళ వారికి నిజంగానే ప్రమేయం లేకుంటే దీనిపై విచారణ జరిపించాల్సిన బాధ్యత వారికి లేదా అని ప్రశ్నించారు.  ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లికి హైకోర్టులో ఊరట రాగానే మరో మూడు కేసులు… హత్యాయత్నం కేసులు నమోదు చేశారని… సిఐపై ఒకవేళనిజంగానే దాడి జరిగి ఉంటే అప్పుడే ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. పాల్వాయ్ గేటు ఘటనలో ప్రిసైడింగ్ అధికారి లాగ్ బుక్ ప్రకారం నడచుకోవాల్సి ఉండగా అలా చేయలేదని ఆక్షేపించారు.

ఉద్యోగస్తులంతా ప్రభుత్వానికి వ్యతిరేకమన్న ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉందని, అందుకే పోస్టల్ బ్యాలెట్ ల లెక్కింపు విషయంలో నిబంధనలు సడలించాలని కోరుతోందని… కానీ దేశ వ్యాప్తంగా ఒకే విధానాన్ని ఎన్నికల సంఘం అమలు చేయాల్సి ఉంటుందని… దీనిపై తాము ఈసీకి ఓ విజ్ఞాపన కూడా ఇచ్చామని సజ్జల వివరించారు గత ఎన్నికల్లో కవర్ మీద సీరియల్ నంబర్ లేదన్న కారణంగా  గుంటూరు లో దాదాపు ఏడు వేల ఓట్లను తిరస్కరించారని గుర్తు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్