Friday, September 20, 2024
HomeTrending NewsVoter list: ఓటరు జాబితాలో మార్పుల చేర్పులకు అవకాశం

Voter list: ఓటరు జాబితాలో మార్పుల చేర్పులకు అవకాశం

భారత ఎన్నికల సంఘం 2022-23 సంవత్సరమునకు సంబంధించిన రెండవ సమ్మరీ రివిజన్ ప్రకటించింది. అందులో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా తేదీ 21 ఆగస్టు 2023 నాడు హైదరాబాద్ జిల్లాకు సంబంధించిన 15 నియోజకవర్గాలలో ప్రచురించబడినది అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును www.ceotelangana.nic.in లేదా https://www.nvsp.in పోర్టల్ లో పరిశీలించుకోవచ్చు అని తెలిపారు.

ఓటరు జాబితాలో పేరు లేకపోయినా లేదా పేరులో ఎటువంటి తప్పులు ఉన్న, పేరు లేదా చిరునామాలో తప్పులు ఉన్న, లేదా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారిన యెడల ఈ పై వెబ్ సైట్ ల ద్వారా మార్పులు చేర్పులు చేసుకోవడానికి 19-09-2023 వరకు అవకాశం కలదని జిల్లా ఎన్నికల అధికారి, కమిషనర్ జిహెచ్ఎంసి రోనాల్డ్ రోస్ తెలియజేశారు.

చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా మార్పులు, చేర్పుల కోసం ఎన్నికల సంఘం వెబ్ సైట్ https://voters.eci.gov.in లేదా voter helpline app download చేసుకొని పరిశీలించుకోవచ్చు అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

ఫారం 6 ద్వారా నమోదు అంశాలు

• 1 అక్టోబర్ 2023 నాటికి 18 సంవత్సరాల వయస్సు దాటుతున్న వారందరు, ఇప్పటికి ఓటరు జాబితాలో పేరు లేని వారు.

• మీ దగ్గర ఓటరు గుర్తింపు కార్డు (EPIC) ఉన్నప్పటికి ప్రస్తుత ఓటరు జాబితాలో పేరు లేని వారు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవచ్చు.

ఫారం 6B

• ఓటరు జాబితాలో ఆధార్ అనుసంధానం చేసుకొనుటకు

ఫారం 7

•.కొత్త ఓటరు చేర్పు పై అభ్యంతరం

• ఓటరు జాబితాలో పేరు తొలగింపు

ఫారం-8

• ఓటరు జాబితాలో పేరు ఇతర వివరాలలో తప్పులు ఉన్నచో

• కుటుంబ సభ్యుల పేర్లు ఒకే పోలింగ్ స్టేషన్ లో కాకుండా అదే నియోజకవర్గంలో వేరు వేరు పోలింగ్ బూత్ లలో ఉన్నచో

• ఫోటో తప్పుగా ఉన్నా లేదా ఫోటో సక్రమంగా లేకున్నా

• ఓటరు జాబితాలో మొబైల్ నెంబర్ అప్ లోడ్ కు

• ఓటరు జాబితాలో మీ పేరు ఇతర నియోజకవర్గం లో తప్పుగా నమోదైనప్పుడు.

ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులకు సవరణ కోసం eci వెబ్ సైట్ https://voters.eci.gov.in ద్వారా గాని మీ మొబైల్ లో ఓటర్ హెల్ప్ లైన్ (voter helpline app) download చేసుకోవచ్చునని, పూర్తి వివరాలకు ఓటరు హెల్ప్ లైన్ 1950 నెంబర్ ను సంప్రదించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ నగర వాసులను కోరారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్