Sunday, January 19, 2025
HomeTrending Newsపోస్టల్ బ్యాలెట్ : ప్రత్యేక మెమో వెనక్కి తీసుకున్న ఈసీ

పోస్టల్ బ్యాలెట్ : ప్రత్యేక మెమో వెనక్కి తీసుకున్న ఈసీ

పోస్టల్ బ్యాలెట్‌ ఓట్లపై వైసీపీ లేవనెత్తిన అభ్యంతరాలపై నేడు అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి సంతకం మాత్రమే ఉండి సీల్, హోదా లేకపోయినా ఆ ఓటు చెల్లుతుందంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ఇచ్చిన  మెమోపై వైఎస్సార్సీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి  ఈ మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు.

 మీనా ఇచ్చిన మెమోను సమర్ధించిన కేంద్ర ఎన్నికల సంఘం  సీల్, హోదా లేకపోయినా పోస్టల్ బ్యాలెట్లను పరిగణన లోకి తీసుకోవాలని  ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ లేఖ రాశారు.

పోస్టల్ బ్యాలెట్ రూల్స్ పై వైఎస్సార్సీపీ హైకోర్టును ఆశ్రయించింది.  మీనా ఇచ్చిన మెమోపై లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేసింది.  ఇక్కడ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. కోర్టులో విచారణ చేపట్టగానే మెమో ను వెనక్కి తీసుకున్నట్లు కోర్టుకు తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్