విద్యుత్ చార్జీల పెంపుతో పేదలపైన భరించలేనంత భారం పడుతుందని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. పేదలపై ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచి మరోసారి భారం మోపేందుకు కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలపై రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) శుక్రవారం హైదరాబాద్ రెడ్ హిల్స్‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సి) భవనంలో నిర్వహించిన బహిరంగ విచారణ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
నెలవారి విద్యుత్ చార్జీలు, సర్ ఛార్జీల బిల్లులను పెంచే ఆలోచనను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని శ్రీధర్ బాబు డిమాండ్ చేశారు. చార్జీల పెంపు నిర్ణయం మంచిది కాదన్న శ్రీధర్ బాబు ఇటీవల కమీషన్ అనుమతి లేకుండా వేసిన డెవలప్ మెంట్ చార్జీలను ఉపసంహరించుకోవాలన్నారు. విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో జరిగిన ప్రమాదలు సంఘటనలు ,భాదిత కుటుంబలకు ఆర్ధికంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : కరెంటు చార్జీల పెంపునకు కసరత్తు